ఈ ఫంగస్ వ్యాధి సంవత్సరంలో కొంత కాలానికే పరిమితం అని వారు చెబుతున్నారు. ముఖ్యంగా చలికాలం, తేమ ఎక్కువగా ఉన్న సమయంలో ఈ ఫంగస్ ప్రభావం ఎక్కువగా కనిపిస్తుందని తెలిపారు. అయితే ఇది తాత్కాలికమే. మార్చి నెలకల్లా వేప చెట్లు మళ్లీ కోలుకుని… కొత్త చిగుర్లు వేసి, పచ్చదనాన్ని సంతరించుకుంటాయని నిపుణులు భరోసా ఇస్తున్నారు. ప్రస్తుతం చెట్లు ఎండిపోయినట్టు కనిపించినా… లోపల జీవశక్తి మాత్రం పూర్తిగా నశించలేదని అంటున్నారు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే… ఈ ఫంగస్ కేవలం చెట్లకే సోకుతుంది. మనుషులకు, జంతువులకు ఎలాంటి ప్రమాదం లేదని నిపుణులు స్పష్టంగా చెబుతున్నారు. వేప చెట్టుకు ఉండే ఔషధ గుణాలు, సహజ రోగనిరోధక శక్తి వల్లే ఈ ఫంగస్‌ను కూడా ఎదుర్కొని… మళ్లీ కొత్త జీవంతో ఎదుగుతోందని వారు వివరించారు. అందుకే వేప చెట్టు “ఆరోగ్యానికి దేవుడి వరం” అని పెద్దలు చెప్పేవారని గుర్తు చేస్తున్నారు.
ఇంతకుముందు ఈ వ్యాధి ప్రధానంగా ఉత్తర భారతదేశంలో కనిపించేదని, ఇప్పుడు వాతావరణ మార్పుల ప్రభావంతో దక్షిణ భారతదేశానికీ విస్తరిస్తోందని నిపుణులు చెబుతున్నారు. తెలంగాణలో విస్తృతంగా వేప చెట్లు ఉండటంతో ఈ ప్రభావం ఎక్కువగా కనిపిస్తున్నట్లు తెలిపారు. మొత్తానికి… ప్రస్తుతం వేప చెట్లు ఎండిపోయినట్టు కనిపించినా భయపడాల్సిన పనిలేదు. ఇది శాశ్వత నాశనం కాదు… తాత్కాలిక సమస్య మాత్రమే. ఇంకొన్ని వారాల్లోనే వేప చెట్లు మళ్లీ పచ్చగా మారి… నీడనిచ్చే స్థితికి చేరుకుంటాయి. ప్రకృతి తనలోని శక్తితో తానే కోలుకుంటుందన్న దానికి ఇదే మరో ఉదాహరణ అని నిపుణులు చెబుతున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి