ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒకటి సాధించాలని కలలు కంటూ ఉంటారు. కానీ అందరూ అనుకున్న కలలని సాధించడంలో ఎన్నో సవాళ్ళను అధిగమిస్తూ ఉంటారు. అదే విధంగా చదువు పరంగా మీకున్న లక్ష్యాలను చేరుకోవాలంటే ఒక ప్రణాళిక ప్రకారం వెళ్లడం చాలా ముఖ్యం. అందులోనూ ఐఏఎస్ లాంటి పరీక్షలకు ప్రిపేర్ అవ్వడం ఎంత కష్టమో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.