మనలో చాలామంది జీవితంలో ఏ చిన్న సమస్య వచ్చినా ఒత్తిడికి లోనవుతూ ఉంటారు. ఆ ఒత్తిడి వల్ల జీవితంలో సక్సెస్ ను సాధించలేకపోతూ ఉంటారు. ఎక్కువగా ఒత్తిడికి లోనయ్యే వారికి ఆరోగ్యపరమైన సమస్యలు కూడా వస్తాయని తాజా అధ్యయనాల్లో తేలింది. మనలో ఒత్తిడి ఎంత పెరిగితే రోగనిరోధక శక్తి అంత తగ్గుతుంది. చాలామంది ఏదైనా సమస్య వచ్చిందని తెలిస్తే చాలు విపరీతమైన ఒత్తిడికి గురవుతారు. 
 
మానవ సంబంధాలలో వచ్చే మార్పులు, అనారోగ్య సమస్యలు, ఆర్థిక విషయాలలో వచ్చే మార్పులు మనల్ని ఎక్కువగా ఒత్తిడికి గురి చేస్తాయి. ప్రతి ఒక్కరూ ఒత్తిడిని వీలైనంత తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి. విద్యార్థులు, పోటీ పరీక్షల కోసం సిద్ధమయ్యేవారు ఎక్కువగా ఒత్తిడికి లోనవుతుంటారు. పరీక్షల్లో మంచి మార్కులు వస్తాయో లేదో అని కొందరు... ఉద్యోగం సాధిస్తామో లేదో అని మరికొందరు ఒత్తిడికి గురవుతూ ఉంటారు. 
 
కానీ ఎవరైతే ఒత్తిడికి లోనవకుండా సక్సెస్ కోసం ప్రయత్నిస్తారో వారికే సులభంగా సక్సెస్ సొంతమవుతుంది. యోగా లేదా మెడిటేషన్ ద్వారా ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. ఇష్టమైన పనులు చేయడం ద్వారా ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. మనకు ఇష్టమైన వ్యక్తులతో కొంత సమయం మాట్లాడటం ద్వారా ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. ఒత్తిడి వల్ల మనకు నష్టమే తప్ప ఎటువంటి లాభం చేకూరదు. 
 
ఎటువంటి సమస్యకైనా ప్రశాంతంగా ఆలోచిస్తే పరిష్కారం లభిస్తుంది. పరీక్షల్లో ఒత్తిడికి గురైతే తెలిసిన ప్రశ్నలకు కూడా తప్పు జవాబులను గుర్తించే అవకాశం ఉంటుంది. ఒత్తిడికి ఎక్కువగా గురయ్యే వ్యక్తులు ఇతరులపై కోపాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. అందువల్ల ఇతరులకు కూడా మనపై సదభిప్రాయం ఏర్పడదు. ఒత్తిడికి గురయ్యేవారు దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల భారీన పడే అవకాశం ఉంది. అందువల్ల ఒత్తిడిని అధిగమించి లక్ష్యాల కోసం ప్రయత్నిస్తే విజయం సులభంగా సొంతమవుతుంది.             
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: