ఒకప్పటి అనుబంధాలు ఈరోజుల్లో కనిపించటంలేదు. ఎవరి జీవితాలు వారివి అయిపోతున్నాయి. మనల్ని కని పెంచి ఇంతవాళ్లని చేసిన అమ్మ ని మర్చిపోతున్నాము. కనీసం సొంత తల్లిదండ్రులను కూడా పట్టించుకోలేని స్వార్థపూరితంగా మారిపోతున్న ఈ రోజుల్లో ఒక్కసారి తల్లిదండ్రుల విలువైన ప్రేమను మీకు చూపించాలి అనుకుంటున్నాను.

 

కళ్ళు మూసుకొని ప్రేమించేది ప్రియురాలు అయితే, కళ్ళు తెరిచి ప్రేమించేది స్నేహితురాలు.కళ్ళు ఉరిమి ప్రేమించేది భార్య అయితే కళ్ళల్లో ప్రేమను కనిపించనివ్వకుండా దాన్ని గుండెల్లో పెట్టుకొని ప్రేమించేది అమ్మ. అమ్మ బిడ్డ ఆకలి చూస్తుంది. కొడుకు బాధని కనిపెడుతుంది. అమ్మ నీకు జీవితాన్ని ఇస్తే నాన్న నీకు జీవనాన్ని ఇస్తారు. అమ్మ భద్రత అయితే నాన్న బాధ్యత.కానీ ఈ కాలం పిల్లలు ఎవరి సుఖం వారు చూసుకుంటున్నారు. పెళ్లయి, భార్య వచ్చాక పిల్లలు పుట్టాక నా కుటుంభం అని అనుకుని కన్న అమ్మని వదిలేస్తున్నారు.

 

అసలు మనకంటూ ఈ జీవితాన్ని ఇచ్చిందే అమ్మ.. కానీ ఆ అమ్మనే మనం దూరం పెడుతున్నాము. ఎవరికీ వారు  స్వార్థపూరితంగా ఆలోచిస్తున్నారు. వారి జీవిత కాలమంతా మీ కోసం ధారపోసిన తల్లిదండ్రుల కోసం రోజుకి ఒక్క రెండు నిమిషాలు పెట్టండి.వారి విషయంలో మీ బాధ్యతను మీరు నిర్వర్తించండి.పిల్లల్ని తలుచుకుని అమ్మ భాద పడని రోజు అంటూ ఉండదు. మన పిల్లలు మనకు దూరం అయితే ఎలాగా ఉంటుందో. మన అమ్మకి మనం దూరమయితే అలాగే ఉంటుంది మిత్రమా...  ప్రతిరోజు ఒక్క ఫోన్ కాల్ చేసి మీరు మాట్లాడే ఆ రెండు నిమిషాలు వారికి ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. నా కొడుకు నాతో మాట్లాడాడు అనే ఆనందం ముందు ఏదన్నా తక్కువే అమ్మకి. కనీసం ఒక రెండు వారాలకయినా అమ్మని చుడండి. ఈ పెద్దవయసులో అమ్మ కి కావలిసింది బిడ్డల ప్రేమ మాత్రమే.. అమ్మ, నాన్న కన్నీళ్లు కారిస్తే అది మనకు, మన కుటుంబానికే మంచిది కాదు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: