మానవ శరీరంలోని హార్మోన్‌లపై ఈ రసాయనం ప్రభావం చూపడంతో అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.నైల్ పాలిష్ వాసన ప్రతి రోజు చూసే వారు మెల్ల మెల్లగా బరువు పెరుగుతారని, మరీ ఎక్కువగా వాడితే మాత్రం బరువు మరీ ఎక్కువ పెరుగుతారని పేర్కొన్నారు. నెయిల్ పాలీష్‌లను చర్మానికి అంటుకోకుండా వేసుకోవాలి. అలా వేసుకుంటే సగం వరకు ఇబ్బందులను తగ్గించుకోవచ్చు. చర్మంకు అంటిన 10 నుండి 14 గంటల్లోనే నెయిల్ పాలీష్‌లోని టీపీహెచ్‌పీ పని చేయడం ప్రారంభించి బరువు పెరిగేలా చేస్తుందని అంటున్నారు ముఖ్యంగా చర్మంకు నెయిల్ పాలీష్ అంటకుండా చూసుకోండి.
అలాగే వాడే నైల్ పాలిష్ కూడా మంచిది వాడండి. డబ్బులు తక్కువ కదా అని మార్కెట్లో దొరికే నాసిరకం నైల్ పాలిష్ లను అసలు వాడకండి.. అలానే కొంతమందికి నైల్ పాలిష్ వాసన అంటే ఇష్టపడతారు.. ఎట్టి పరిస్థితులలోను అలా వాసన చూడకండి. అలాగే గోళ్లకు వేసుకునే రంగులో టాల్యూన్, ఫార్మాల్డిహైడ్, ఎసిటోన్, పారాబెంజ్ వంటి రసాయనాలు ఉంటాయి. టాల్యూన్ వల్ల గోళ్ల చుట్టూ ఉన్న చర్మం పొడిబారిపోతుంది.అలాగే గోళ్ల రంగుని ఎంచుకునేటప్పుడు అందులో విటమిన్ ఇ, మినరల్స్, బొటానికల్ ఎక్సాస్ట్ ఉన్నవాటిని ఎంచుకుంటే మంచిది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి