ఈకాలంలో చాలామంది దంపతులు  పిల్లల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తొందరగా పిల్లలను కావాలనుకునే వారికంటే ముందు లైఫ్ లో సెట్ అయన తర్వాత  పిల్లల్ని కంటే  బాగుంటుందని ఆలోచిస్తున్నారు. అలాగే పిల్లల మధ్య ఎడం ఉండాలని లేకపోతే సమస్యలు వస్తాయని తెలుసుకుంటున్నారు. అయితే.. దీనికోసం కొంతమంది డాక్టర్ల సలహాలు తీసుకుని జాగ్రత పడేవాళ్ళు కొంతమంది అయితే, ఎటువంటి సలహాలు తీసుకోకుండానే బర్త్ కంట్రోల్ పిల్స్ వాడేవాళ్లు మరికొందరు. అయితే ఇలా డాక్టర్ల సలహాలు తీసుకోకుండా బర్త్ కంట్రోల్ పిల్స్ వాడటం మంచిదికాదని నిపుణులు అంటున్నారు. ఇలా డాక్టర్ల సలహాలు తీసుకోకుండా పిల్స్ వాడటం వల్ల చాలా రకాల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని పలువురు పరిశోధకులు చెబుతున్నారు. కేవలం శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా చాలా సమస్యలను  ఎదుర్కోవలసి వస్తుందని డాక్టర్లు చెబుతున్నారు.



ఈ బ‌ర్త్ కంట్రోల్ పిల్స్ రెగ్యుల‌ర్ గా వేసుకోవ‌డంతో శ‌రీరంలో విట‌మిన్ బి, సి, ఈ, జింక్, సెలీనియం, మెగ్నీషియం త‌గ్గుతుంద‌ని డాక్ట‌ర్లు చెబుతున్నారు. అందుకోసం  మాంసం, పాలు, కూర‌గాయ‌లు, బ్రెడ్, డ్రై ఫ్రూట్స్, పండ్లు , స్వీట్స్ వీలైనంత ఎక్కువగా మీ రోజువారీ ఆహారంలో తీసుకోవాల‌ని సూచిస్తున్నారు. డాక్టర్ సలహా మేరకు మల్టీవిటమిన్ మెడిసిన్స్ కూడా వేసుకోవ‌ల‌సి ఉంటుందని తెలుపుతున్నారు.
ఈ పిల్స్ వాడ‌టం వ‌ల్ల చాలా మంది మ‌హిళ‌ల్లో కోపం, చిరాకు, బాధ లాంటి ఎమోషన్స్ ఎక్కువగా వస్తాయట.  ఆ ఒత్తిడి నుంచి బయటపడాలంటే ప్రతిరోజూ మెడిటేషన్, యోగా చేయాల‌ని సూచిస్తున్నారు. ఉదయం ఒక‌ అరగంటైనా ఎక్సర్సైజ్ చేయాల‌ని తెలుపుతున్నారు. అలాగే నిద్ర చాలా అవ‌స‌ర‌మ‌ని చెబుతున్నారు. 7 నుంచి 8 గంటల నిద్ర అవ‌స‌ర‌మ‌ని చెబుతున్నారు.



అవ‌గాహ‌న లోపంతో చాలామంది మోతాదుకి మించి పిల్స్ వేసుకుంటున్నారని, అలా చేయ‌డం వ‌ల్ల బ‌రువు అధికంగా పెరిగే అవ‌కాశాలు ఉన్నాయని డాక్ట‌ర్లు చెబుతున్నారు. అలాగే ఓవర్ డోస్ వ‌ల్ల ప‌లు రకాల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయ‌ని చెబుతున్నారు. అందుకే మెడిసిన్స్ వేసుకునే ముందు ఒక్కసారి డాక్టర్ని కలవాల‌ని సూచిస్తున్నారు. ఆరోగ్యాన్ని  కాపాడుకోవటానికి ప్రీ బయోటిక్స్ ఎక్కువగా ఉండే పెరుగు, మజ్జిగ, ఎక్కువగా తీసుకోవాల‌ని సూచిస్తున్నారు.ఈ పిల్స్ కాలేయం పనితీరుపై కూడా ప్రభావం చూపుతాయ‌ని చెబుతున్నారు. అందుకె మీరు ఎటువంటి గర్భనిరోధక పద్దతులను పాటించిన ముందుగా వైద్యుని సలహా మేరకు వాడండి.. !!

మరింత సమాచారం తెలుసుకోండి: