ప్రతి ఒక్కరి జీవితంలో ప్రేమ అనేది ఎక్కడో, ఎప్పుడో చిగురిస్తుంది.. దీనికి ఎవరూ అతీతులు కారు.. పెద్ద పెద్ద స్థాయిలో ఉన్న వారు, సెలేబ్రిటీలు సైతం సామాన్యులను చూసి ప్రేమలో పడిపోతు ఉంటారు. అలా రాజీవ్ గాంధీ సోనియా గాంధీ ని చూసి ప్రేమలో పడ్డారు.. వీరి పరిచయం విచిత్రం.. కలయిక అమోఘం.. పెళ్లి ఓ వండర్ అంటున్నారు సోనియా గాంధీ.. మరి ఎంతోమందిని ప్రేరేపించేలా ఉన్న వీరి ప్రేమ కథ ఎలా ఉందొ ఆమె మాటల్లోనే ఇప్పుడు చూద్దాం...

ఏం జరిగిందో, ఎప్పుడు జరిగిందో తెలియదు కానీ ఓ స్వచ్ఛమైన చిరునవ్వు ,ఎదుటివారిని ఆకర్షించే కళ్ళు, మిరుమిట్లు గొలిపే తేజస్సు, ఆజానుబాహుడు లాంటి నిలువెత్తు రూపం నన్ను ఇట్టే ఆకర్షించింది.. పక్కనే ఉన్న నా నా స్నేహితురాలిని అడిగాను ఇంత అందంగా ఉన్నాడు ఎవరితను అని.. నా స్నేహితురాలు ఆయన ఓ భారతీయుడు.. పండిట్ నెహ్రూ గారి కుటుంబం నుంచి వచ్చారు.. అని ఆయన గురించి చెప్పే మాటలను వింటూ నన్ను నేనే మర్చిపోయి ఆయననే అలా చూస్తూ ఉండిపోయాను..

మరుసటి రోజు భోజనానికి వెళ్ళినప్పుడు ఆయన అక్కడే ఉన్నారు.. అలాగే చూస్తూ ఉండిపోయా.. ఎన్ని రోజులు అలా చూస్తూ సంతోషపడ్డానో నాకు తెలియదు..అలా ఆయనను నేను ఎప్పుడు ప్రేమించాను నా ప్రేమ నీకు ఎప్పుడు వ్యక్తపరిచే నేను గుర్తు లేదు కానీ మా ప్రేమను అప్పటి ప్రధాని గా అయినా ఇందిరా గారికి చెప్పే సమయం మాత్రం ఆసన్నమైంది.. ప్రధాని అయిన తర్వాత ఇందిరాగాంధీ గారు ఓసారి ఇంగ్లాండ్ వచ్చినప్పుడు, కొంచెం భయంగానే మేము మా పెళ్ళికి మీ అనుమతి కావాలని అడిగాము.. అప్పుడు ఇందిరాగాంధీ గారు ఎంతో మర్యాదగా మమ్మల్ని భారతదేశం రావాలని కోరారు.. నేను ప్రపంచంలో ఏ మూలన రాజీవ్ తో కలిసి బతుకుతాను అన్న ధైర్యం నాకు ఉన్నది కాబట్టి అప్పుడు పెళ్లి చేసుకోగలిగాను.. ఇందిరాగాంధీ గారు పెళ్లిలో నెహ్రూజీ బహిష్కరించిన గులాబీ చీర ఇచ్చారు .  నేను అదే ధరించాను.. అలా మా ప్రేమ సాకారమైంది.. అన్నారు..


ఇక చివరగా .."రాజీవ్ తో నేను బ్రతికిన దాని కన్నా ఒంటరిగా ఈ దేశం లో జీవించింది ఎక్కువ..నన్ను వెళ్లిపొమ్మని చాల మంది అంటున్నారు. నా రాజీవ్ ని నాకిస్తే తీసుకొని వెళ్ళిపోతాను లేదంటే రాజీవ్ కలిసిన ఈ నెలలోనే నన్ను కలిసిపోనివ్వండి" అన్నారు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: