బజాజ్ ఆటో త్వరలో 180 సిసి బైక్‌ను భారత మార్కెట్లో విడుదల చేయబోతోంది. దీని పేరు బజాజ్ పల్సర్ 180 రోడ్‌స్టర్ అని సంబంధిత వర్గాలు తెలిపాయి. కంపెనీ ఇప్పటికే ఈ విభాగంలో పల్సర్ 180 ఎఫ్ నియాన్‌ను విక్రయిస్తుంది. అయితే ఈ కొత్త బైక్ ప్రస్తుతం మార్కెట్లో ఉన్న హోండా హార్నెట్ 2.0, టివిఎస్ అపాచీ 160 మరియు సుజుకి జిక్సెర్ 155 వంటి బైక్‌లతో పోటీ పడనుంది. ఈ సంస్థ బైక్ గురించి ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. అయితే బైక్‌వాలే నివేదిక ప్రకారం దీన్ని త్వరలో మార్కెట్లోకి తీసుకురానున్నారు. దీని ధర రూ .1,05,216 గా ఉంటుందని సంస్థ వెల్లడించింది.