ఇది సరికొత్త ఎక్స్ ప్రెస్ రైలు ...ఈ రైలుకి ప్లాట్ ఫారంలు ఉండవు ...స్టాపులు ఉండవు ఒకసారి స్టార్ట్ అయ్యిందంటే 40  కిలోమీటర్స్ వరకు రయ్యిమంటూ దూసుకుపోతుంది .మధ్యలో ఎన్ని సిగ్నల్స్ డోంట్ కేర్ . అసలు ఈ రైలుకు డ్రైవర్ కూడా అవసరం లేదంటే నమ్మండి .ఏంటి ఆశ్చర్య పోయారా ఈ రైల్ ని చూస్తే మీరే నమ్ముతారు .రైల్  కదలాలి అంటే దానికొక డ్రైవర్ ఉండాలి రైల్ కదిలేందుకు గ్రీన్ సిగ్నల్ వచ్చి ఉండాలి .మరి ఆగాలంటే రెడ్  సిగ్నల్ వచ్చి ఉండాలి . కానీ ఈ రైల్ మాత్రం మాత్రం సిగ్నల్ దగ్గర ఆగకుండా దూసుకెళ్లింది .


రాజస్థాన్ లో ఈ ఘటన చోటు చేసుకుంది .ఎల్  అండ్ టీ కంపెనీకి చెందిన  మెటీరియల్ తరలించాల్సిన గూడ్స్ రైలును సెంద్రా రైల్వే స్టేషన్‌లో నిలిపి ఉంచారు. అయితే రైల్ డ్రైవర్ లేకుండానే ఈ రైల్ కదిలింది . అతి వేగంతో పట్టాలపై దూసుకుపోయింది . ఏం జరుగుతుందో కాసేపు రైల్వే అధికారులకి అర్ధం కాక  షాక్ కి గురయ్యారు .వెంటనే అప్రమత్తమయిన సిబ్బంది , అధికారులు రైల్ ని ఆపేందుకు ప్రయతినిచ్చారు .రైల్ ని ఆపేందుకు శతవిధాలా ప్రయత్నించినా ఉపయోగం లేకుండా పోయింది ..


రైల్ ఆగటానికి అక్కడక్కడా బండరాళ్లు బస్తాలు వేసినప్పటి ఉపయోగం రైలు ఆగలేదు  . రైల్ స్పీడ్ కి అవన్నీ చెల్లా చెదురయ్యాయి .ఇలా ఎన్ని ప్రయత్నాలు  చేసిన రైల్ మాత్రం ఆగలేదు . అలా అతివేగంతో 40  కిలోమీటర్లు దూసుకెళ్లిన రైలు దానంతట అదే సోజాత్ స్టేషన్ దగ్గర నిలిచిపోవడంతో  ఊపిరిపీల్చుకున్నారు అధికారులు.డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ఇలా జరిగిందా ...లేదా ఏదైనా అసాంకేతిక లోపం వల్ల జరిగిందా అనే దానిపై అధికారులు దర్యాప్తు జరుపుతున్నారు . అయితే గూడ్స్ ట్రైన్ కాబట్టి పర్లేదు కానీ ... ప్రయాణికులు ఉన్న ట్రైన్ కి  ఇలా జరిగితే పరిస్థితి ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు . 


మరింత సమాచారం తెలుసుకోండి: