కొత్త డిస్కం ఏర్పాటు పేరుతో కొత్త అప్పులు తీసుకునే ప్రణాళికలు పాత బాధ్యతలను విస్మరిస్తున్నాయని కిషన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పవర్ గ్రిడ్ బలహీనపడితే రాష్ట్రానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని హెచ్చరించారు. రాష్ట్రంలో డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో ఉత్పత్తి సామర్థ్యం పెంచాలని సూచించారు.క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీలో ఘనమైన లక్ష్యాలు ప్రకటించినా అమలులో నిర్లక్ష్యం కనిపిస్తోందని కిషన్ రెడ్డి విమర్శించారు. 2030 నాటికి 20 వేల మెగావాట్లు, 2035 నాటికి 40 వేల మెగావాట్ల సౌర ఇతర పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి లక్ష్యాలు నిర్దేశించినా నిర్మాణాత్మక చర్యలు లేవని ఆయన అన్నారు.
రాష్ట్రంలో సూర్యరశ్మి ఎక్కువగా ఉండటం, గాలి సామర్థ్యం ఉండటం వంటి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కేంద్రం నుంచి ఎన్టీపీసీ ద్వారా కొత్త ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నా రాష్ట్రం పూర్తి స్థాయిలో కొనుగోలు అంగీకారాలు ఇవ్వడం లేదని ఆరోపించారు. ఉచిత విద్యుత్ పథకం గృహ జ్యోతి కింద 200 యూనిట్ల వరకు ఉచితంగా అందిస్తున్నా దీర్ఘకాలిక పరిష్కారాలు అవసరమని గుర్తు చేశారు.విద్యుత్ ప్రాజెక్టులు ఆలస్యమవుతున్నాయని కిషన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.
ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లు పరిస్థితి ఉందని వ్యాఖ్యానించారు. డిస్కంలు నష్టాల్లో కూరుకుపోవడం, పంపిణీ వ్యవస్థ బలోపేతం కాకపోవడం రాష్ట్ర ఆర్థిక భారాన్ని పెంచుతున్నాయి. సింగరేణి కాలరీలకు బకాయిలు చెల్లించకపోవడం వల్ల ఆ సంస్థ కూడా ఇబ్బందులు పడుతోంది. కేంద్రం సహకారం అందిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం సమన్వయం చూపడం లేదని ఆయన అన్నారు.
9490520108.. వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి