ముఖ్యంగా వైజయంతి మూవీస్, స్వప్న సినిమా లాంటి గొప్ప సంస్థలతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడం చాలా అదృష్టంగా భావిస్తున్నానని, నాకు తెలుగు స్పష్టంగా రాకపోయినయినప్పటికీ తనకు ఎంతో సపోర్ట్ చేసిన చిత్ర బృందనికి కృతజ్ఞతలు. అలాగే తెలుగు డైలాగ్స్ చెప్పడం గురించి మాట్లాడుతూ.. నాకు తెలుగు భాష మీద పెద్దగా అవగాహన లేదు.ఛాంపియన్ డైరెక్టర్, ప్రదీప్ గారి వల్లే నాకు భాష విషయంలో చాలా సపోర్ట్ చేశారు. వాళ్ల సపోర్ట్ తో తెలుగు డైలాగ్స్ ఛాంపియన్ చిత్రంలో చక్కగా పలికాను అంటూ తెలిపింది. అలాగే తాను సినిమాలో మాట్లాడిన విధానం కూడా ఆడియన్స్ కి బాగా నచ్చుతుందని భావిస్తున్నానని తెలిపింది.
తాను ఇతర భాషలలో ఎన్నో చిత్రాలు చేసి ఎన్నో అద్భుతమైన సందేశాలని ప్రేక్షకులకు అందించాను తెలుగు ఆడియన్స్ ప్రోత్సాహం మరింత బలాన్నిస్తుంది, ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులు నన్ను ఆదరిస్తారని నమ్ముతున్నారా.. తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒక్కసారి పని చేస్తే మళ్లీ మళ్లీ తెలుగు సినిమాలే చేయాలనిపిస్తుంది, ఈ కథ విన్నప్పుడే చాలా ఎమోషనల్ గా అనిపించింది, ఒక సినిమాలో ఉండాల్సిన అన్ని ఎలిమెంట్స్ ఈ చిత్రంలో ఉన్నాయి. ఇందులో తన చంద్రకళ పాత్ర ప్రేక్షకులకు గుర్తుండిపోయేలా ఉంటుందని తెలిపింది.
హీరో రోషన్ కూడా చాలా స్వీట్ తన డైలాగ్స్, డాన్స్ అన్ని విషయాలలో సపోర్టు చేస్తారు. అలాగే హైదరాబాద్ ఫుడ్ నచ్చిందా అని ప్రశ్నించగా? చాలా స్పైసీగా ఉందని ఇక్కడ బిర్యానీ అంటే నాకు చాలా ఇష్టం. రామ్ చరణ్ గారు అంటే నాకు చాలా ఇష్టం. ఆయన చేతిలోనే ట్రైలర్ లాంచ్ జరగడం మరింత ఆనందంగా ఉందని, ఆయన నటించిన మగధీర సినిమా ఎన్నోసార్లు చూశానని, అలాగే అల్లు అర్జున్ గారు అన్న కూడా చాలా ఇష్టమని తెలిపింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి