జిల్లాల వారీగా అత్యధికంగా పాజిటివ్ కేసుల విషయానికి వస్తే.. చిత్తూరు జిల్లాలో 444 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి, అలాగే కాకినాడ జిల్లాలో 183, విశాఖపట్నం 143, కడప జిల్లా 118, నెల్లూరు జిల్లా 113, విజయనగరం 96, తిరుపతి 90, గుంటూరు 85, అనంతపురం 83 కేసులు చొప్పున నమోదైనట్టుగా వైద్యాధికారులు తెలియజేస్తున్నారు. జిల్లాల వ్యాప్తంగా స్క్రబ్ టైఫస్ మరణాల విషయానికి వస్తే.. ఇప్పటివరకు పల్నాడు జిల్లాలో 3, విజయనగరం, బాపట్ల జిల్లాలో 2, కృష్ణాజిల్లాలో 2, ప్రకాశం జిల్లాలో 2, నెల్లూరు జిల్లా, అన్నమయ్య, కాకినాడ, ఎన్టీఆర్ వంటి జిల్లాలో ఒకటి చొప్పున మరణాలు నమోదు అయినట్లుగా తెలుస్తోంది.
స్క్రబ్ టైఫస్ ఎలా సోకుతుంది?
తరచూ పొలాలు అటవీ ప్రాంతంలో ఉండే వారికి సోకుతుంది.
"చిగర్ మైట్ " అనే చిన్న పురుగు కుట్టడం చేత శరీరం పైన మచ్చలాగా ఏర్పడుతుంది. అలా కుట్టినచోట చర్మ కణాలు చనిపోతాయి.
ఈ వ్యాధి సోకిన వారికి శరీరం పైన దద్దుర్లు తీవ్రమైన జ్వరం శ్వాస లోపం వల్ల ప్రమాదం ఏర్పడుతుంది.
వ్యాధి లక్షణాలు:
అధిక జ్వరం, తీవ్రమైన తలనొప్పి, శరీర నొప్పులు, కళ్ళు ఎరుపు, కండరాల నొప్పి పొడి దగ్గు వంటివి వ్యాధి లక్షణాలు. ఈ వ్యాధిని రక్తపరీక్ష ద్వారానే గుర్తిస్తారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి