బాలీవుడ్లో ఫిట్నెస్ కి కేరాఫ్ అడ్రస్ గా పేరు సంపాదించింది సీనియర్ బ్యూటీ మలైకా అరోరా. నిరంతరం ఎప్పుడు తన వ్యక్తిగత జీవితంలో ఏదో ఒక విషయంలో ఈమె పేరు వినిపిస్తూ ఉంటుంది. మలైకా ప్రస్తుతం తన కంటే వయసులో చిన్నవాడైన వ్యక్తితో ప్రేమలో ఉన్నట్లు బాలీవుడ్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మలైకా అరోరా వ్యక్తిగత జీవితం ఎప్పుడూ కూడా ఒక సెన్సేషనే .. మొదటిసారి నటుడు ఆర్భాజ్ ఖాన్ తో పెళ్లి చేసుకొని విడాకులు తీసుకున్న మలైకా ఆ తర్వాత సైలెంట్ అయ్యింది.


కానీ కొన్నేళ్ల తర్వాత ప్రముఖ నటుడు అర్జున్ కపూర్ తో రిలేషన్ షిప్ లో ఉన్నట్లు వార్తలు వినిపించాయి. దీంతో త్వరలోనే వీరిద్దరి వివాహం చేసుకుంటారనుకున్న సమయంలోనే బ్రేకప్ చెప్పుకున్నారు. ఇటీవల అర్జున్ కూడా ఒక ఇంటర్వ్యూలో తాను సింగిల్ అని ప్రకటించడంతో విడిపోయారని అధికారికంగా అందరికీ అర్థమయింది. ఇప్పుడు తాజాగా మలైకా, హర్షా మోహతా అనే వ్యక్తితో డేటింగ్ చేస్తున్నట్లు వినిపిస్తున్నాయి. ఇక్కడ ఒక ఆశ్చర్యపరిచే విషయం ఏమిటంటే మలైకా కంటే హర్షా 17 సంవత్సరాలు చిన్నవాడని సమాచారం.



అర్జున్ కపూర్, మలైకా కంటే కూడా వయసులో చాలా చిన్నవాడనే విషయం అందరికీ తెలిసిందే.. ఇప్పుడు మరొకసారి ఈ కొత్త వ్యక్తి బంధంతో మలైకా బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఈ విషయం బాలీవుడ్లో వైరల్ గా మారడంతో పలువురు నేటిజన్స్ భిన్నాభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ముఖ్యంగా మలైకాకు కొంతమంది సపోర్ట్ చేయగా,మరి కొంతమంది విమర్శిస్తున్నారు. వరుస బ్రేకప్ లు, వయసు పై తేడా అంటూ విమర్శలు చేస్తూ ఉండగా మరి కొంతమంది మలైకా ధైర్యవంతురాలని సమర్థిస్తున్నారు. ప్రస్తుతం బాలీవుడ్ లో వినిపిస్తున్న విషయం పై అటు మలైకా, హర్షా మోహతా కూడా ఇప్పటివరకు ఈ విషయం పైన అధికారికంగా ప్రకటన చేయలేదు. మరి వారిద్దరూ స్నేహితుల లేకపోతే నిజంగానే రిలేషన్ లో ఉన్నారనే విషయం తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: