సీనియర్ ఫిమేల్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి ప్రగతి అంటే తెలియని వారు ఉండరు.ఎన్నో సినిమాల్లో తల్లిగా..అక్కగా.. వదినగా.. అత్తగా.. ఎన్నో పాత్రలు పోషించి చివరికి 49 ఏళ్ల వయసు లో దేశానికి పవర్ లిఫ్టింగ్ లో పథకాలు అందిస్తూ మంచి గుర్తింపు సంపాదించింది. అలా రీసెంట్గా ప్రగతి ఏషియన్ ఓపెన్ అండ్ మాస్టర్స్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్ 2025 లో పాల్గొని భారతదేశానికి నాలుగు మెడల్స్ తీసుకు వచ్చింది. దాంతో ప్రగతి పేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోయింది. అయితే అలాంటి ప్రగతికి మొదట పెళ్లై విడాకులైన సంగతి మనకు తెలిసిందే. ప్రగతికి ఓ కూతురు కూడా ఉంది. అయితే విడాకులు అయ్యాక ప్రగతి మళ్ళీ పెళ్లి చేసుకోలేదు.

అయితే రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో తన రెండో పెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది ప్రగతి.ఆ ఇంటర్వ్యూలో ప్రగతి మాట్లాడుతూ.. రెండో పెళ్లి చేసుకోవాల్సిన అవసరం నాకు ఇప్పటివరకు రాలేదు.ఒకవేళ పెళ్లి చేసుకోవాల్సి వస్తే చేసుకుంటాను. కానీ ఇప్పటివరకు ఆ అవసరం రాలేదు. అయితే జీవితంలో కచ్చితంగా ఒక తోడు ఉండాలి. కానీ నన్ను పెళ్లి చేసుకునే వ్యక్తి నా వయసుకు తగ్గట్టు నా మెచ్యూరిటీ స్థాయికి తగ్గట్టు ఉండాలి. ఒకవేళ నా మెచ్యూరిటీ స్థాయికి తగ్గట్టు నేను ఎంచుకునే వ్యక్తి లేకపోతే నా జీవితం మళ్ళీ కష్టాల్లో పడిపోతుంది.

మళ్లీ పెళ్లయ్యాక నాకు కండిషన్స్ పెడితే దాన్ని నేను భరించలేను. అయితే నాకు ఇప్పుడు 20 ఏళ్ల వయసు ఉంటే ఏదోలే అని సర్దుకుపోయేదాన్ని.కానీ ఇప్పుడు నా వయసు ఎక్కువే.. అలాగే ఆలోచనలు కూడా వేరుగా ఉంటాయి. అందుకే ప్రస్తుతం నా మైండ్ లో రెండో పెళ్లి గురించి ఎలాంటి ఆలోచనలు లేవు అంటూ కుండబద్దలు కొట్టింది ప్రగతి. ఒకవేళ రెండో పెళ్లి చేసుకుంటే తన వయసు మెచ్యూరిటీకి తగ్గట్టు ఉండే వ్యక్తినైతేనే పెళ్లి చేసుకుంటానని కండిషన్ కూడా చెప్పింది.

మరింత సమాచారం తెలుసుకోండి: