టాలీవుడ్ లో వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయింది హీరోయిన్ రకుల్ ప్రీతిసింగ్. ఆ తర్వాత నాన్నకు ప్రేమతో, ధ్రువ, సరైనోడు, బ్రూస్ లీ, లౌక్యం, మన్మధుడు 2 తదితర చిత్రాలలో స్టార్ హీరోలతో నటించి స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించింది. కెరియర్ పీక్స్ లో ఉన్న సమయంలో బాలీవుడ్ వైపుగా వెళ్లడంతో ఈ ముద్దుగుమ్మకు తెలుగులో సినిమా అవకాశాలు తగ్గిపోయాయి. బాలీవుడ్లో పలు సినిమాలలో నటించినప్పటికీ సరైన సక్సెస్ అందుకోలేదు. బాలీవుడ్ లో నిర్మాతగా పేరు సంపాదించిన జాకీ భగ్నానిని ప్రేమించి వివాహం చేసుకుంది. అప్పటినుంచి కొంత మ్యారేజ్ లైఫ్ కి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తోంది రకుల్.


ఇదంతా ఇలా ఉండగా ఇటీవలే హైదరాబాదులో పంజాగుట్టలో సెకండ్ స్కిన్ మేకప్ స్టూడియో & అకాడమీ ఓపెనింగ్ సైతం హీరోయిన్ రకుల్ ప్రీతిసింగ్  చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడ మీడియా వారు అడిగిన ప్రశ్నలకు రకుల్ ప్రీతిసింగ్ సమాధానాన్ని తెలియజేసింది. ఇటీవల కాలంలో తెలుగు సినిమాలు చేయకపోవడం వల్ల తాను తెలుగు ప్రేక్షకులను చాలా మిస్ అవుతున్నానని తెలియజేసింది. తప్పకుండా తాను తెలుగులో సినిమాలు చేస్తానని, నాకు మొదటి విజయాన్ని అందించింది కూడా తెలుగు ప్రేక్షకులే అని తెలిపింది.



ఏదైనా ఒక చక్కటి కథ వస్తే చేస్తాను ఆ సినిమా కథ కోసమే ఎదురు చూస్తున్నాను. నాకు ఒక మంచి తెలుగు కథ రావాలని అభిమానులు అందరూ కోరుకోండి, హైదరాబాదులో ఉండి షూటింగ్ చేయాలని చాలా కోరికగా ఉంది. తెలుగులో బాహుబలి వంటి సినిమా చేయాలనే కోరిక ఉందని అదే నా డ్రీమ్ రోల్ అంటూ కూడా తెలియజేసింది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం రకుల్ ప్రీతిసింగ్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. చివరిగా ఈ ఏడాది  దేదేప్యార్ దే2 చిత్రంలో నటించింది. అలాగే ఇండియన్ 3 చిత్రం పాటుగా మరో బాలీవుడ్ సినిమాల నటిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: