ఆటో మొబైల్స్ కంపెనీలు ఈ మధ్య పోటీ పడి మరి కొత్త ఫీచర్లతో ఉన్న కార్లను మార్కెట్ లోకి విడుదల చేస్తున్నారు. పండగ సీజన్ లో ఎన్నో కార్లు విడుదల అయ్యి మంచి డిమాండ్ ను అందుకున్నాయి. అందులో టాటా మోటార్స్ కార్లు ప్రత్యేకమని చెప్పాలి. టాటా కార్లు కూడా ఎప్పటికప్పుడు మార్కెట్ లోకి వస్తూ ప్రజాదారణ పొందాయి.  ఇప్పటి వరకు వచ్చిన కార్లు ఒక లెక్క ఇప్పుడు వస్తున్న కారు మరో లెక్క అనేలా కొత్త మోడల్ కారు వచ్చేసింది. ఆ కారు ప్రత్యేకతలు ఎంటో ఒకసారి చూసేద్దాం..



ఈ కంపెనీ ఇప్పుడు మరో కారును తీసుకొచ్చింది. టాటా మోటర్స్‌ తన ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌ 'ఆల్ట్రోజ్‌' మోడల్‌లో సరికొత్త వెర్షన్‌ను మార్కెట్లో ప్రవేశపెట్టింది. 'ఆల్ట్రోజ్‌ ఐ-టర్బో' పేరుతో తీసుకొచ్చిన ఈ కారులో శక్తి వంతమైన ఇంజిన్‌తో పాటు కనెక్టెడ్‌ టెక్నాలజీ లాంటి అత్యాఆధునిక ఫీచర్లను పొందుపర్చింది. అంతేకాదు.. ఎక్స్‌టీ, ఎక్స్‌జెడ్‌, ఎక్స్‌జెడ్‌ ప్లస్‌ అనే మూడు వేరియంట్లలో ఇది అందుబాటులో ఉంటుందని టాటా మోటర్స్‌ వెల్లడించింది. పెట్రోల్‌ వేరియంట్‌ ప్రారంభ ధరను రూ.8.26 లక్షలుగా వెల్లడించింది.



డీజిల్‌ వేరియంట్‌ ప్రారంభ ధరను రూ.9.46 లక్షలుగా నిర్ణయించినట్లు తెలిపింది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఆల్ట్రోజ్‌ రెవోట్రాన్‌ మోడళ్ల కంటే ఆల్ట్రోజ్‌ ఐ-టర్బో మోడళ్ల ధర రూ.60 వేలు పై మాటే.ఇంటెలిజెన్స్‌ రియల్‌-టైమ్‌ అసిస్ట్‌ (ఐఆర్‌ఏ) కనెక్టెడ్‌ సాంకేతికతను కలిగిన ఆల్ట్రోజ్‌ ఐ-టర్బోలో 27 కనెక్టెడ్‌ కార్‌ ఫీచర్లు ఉంటాయని కంపెనీ వెల్లడించింది. ఈ కార్లకు అంత డిమాండ్ రావడానికి మరొక ప్రత్యేకత కూడా ఉంది.. . హిందీ, ఇంగ్లిష్‌తోపాటు హింగ్లిష్‌ హిందీ మరియు ఇంగ్లీష్ కమాండ్లను ఈ కారు సులభంగా అర్థం చేసుకోగలుగుతుందని టాటా మోటర్స్‌ వివరించింది.. దాంతో మార్కెట్ లో విడుదల అవ్వగానే సేల్స్ కూడా విపరీతంగా పెరిగాయని తెలుస్తుంది. తెలుగు పండుగ ఉగాది పర్వదినాన అదిరిపోయే ఫీచర్లు కలిగిన మరో కారును విడుదల చేయనున్నట్లు సమాచారం..

మరింత సమాచారం తెలుసుకోండి: