ఇక హ్యాచ్‌బ్యాక్ కన్నా కూడా బాగా విశాలంగా ఉండి అలాగే బెస్ట్ లుకింగ్ కారు కోసం ఎదురు చూసేవారికి కాంపాక్ట్ సెడాన్ కార్లు అనేవి ఓ చక్కటి ఆప్షన్ గా ఉంటాయి. ఇక మనదేశంలో కూడా ఇప్పటికే అనేక రకాల కాంపాక్ట్ సెడాన్ కార్లు అనేవి మనకు అందుబాటులో ఉన్నాయి. అందుకే ఈ నేపథ్యంలో ఈ సంవత్సరంలో ఆగస్టు నెలలో ఎక్కువగా అమ్ముడైన కాంపాక్ట్ సెడాన్ ల జాబితా వెల్లడవ్వడం జరిగింది.ఇక ఈ జాబితా ప్రకారం చూసుకున్నట్లయితే గత నెలలో ఎక్కువగా అమ్ముడైన కార్లలో హోండా అమేజ్ కాంపాక్ట్ సెడాన్ ఈ విభాగంలో మారుతి సుజుకి డిజైర్ అమ్మకాలను దాటేసి అగ్రస్థానంలో నిలవడం జరిగింది. ఇక సాధారణంగా, ఈ విభాగంలో డిజైర్ ఎల్లప్పుడూ కూడా ముందంజలో ఉంటుందని చెప్పాలి. అయితే ఈసారి హోండా అమేజ్ అమ్మకాలు మాత్రం ఏకంగా 79 శాతం వృద్ధి చెంది అగ్రస్థానంలో నిలవడం జరిగింది.ఇక ఇందుకు ప్రధానం కారణం చూసినట్లయితే హోండా కంపెనీ ఇటీవల హోండా అమేజ్ లో కొత్త 2021 ఫేస్‌లిఫ్ట్ మోడల్ ని ప్రవేశపెట్టడం జరిగింది.

ఇక ఈ జాబితాలో హోండా అమేజ్ ఇంకా డిజైర్ ల తర్వాతి స్థానాల్లో హ్యుందాయ్ ఔరా, టాటా టిగోర్ ఇంకా ఫోర్డ్ ఆస్పైర్ మొదలైన మోడళ్లు అనేవి ఉన్నాయి.ఇక హోండా అమేజ్ కార్ అమ్మకాలు వచ్చేసి గడచిన సంవత్సరం ఆగస్టు నెలలో 3684 యూనిట్లుగా ఉండగా, ఈ సంవత్సరం ఆగస్టు నెలలో ఇవి 6591 యూనిట్లుగా నమోదవ్వడం జరిగింది.ఇక ఈ సమయంలో హోండా అమేజ్ కాంపాక్ట్ సెడాన్ కార్ల అమ్మకాలు ఇప్పుడు 79 శాతం వృద్ధిని సాధించడం జరిగింది. ఇక ప్రస్తుత పండుగ సీజన్ లో కంపెనీ ఈ కాంపాక్ట్ సెడాన్ కార్ల పై ఆకర్షణీయమైన డిస్కౌంట్లను అందించడం జరుగుతుంది.ఇక ప్రస్తుతం మార్కెట్లో హోండా అమేజ్ మూడు వేరియంట్లలో మనకు అందుబాటులో ఉంది. వీటిలో E, S ఇంకా అలాగే VX వేరియంట్లు ఉన్నాయి. ఇందులో S ఇంకా VX వేరియంట్లు కొత్త 2021 ఫేస్‌లిఫ్ట్ లో మనకు అందుబాటులో ఉన్నాయి. ఇక ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఈ సెడాన్ పెట్రోల్ ఇంకా డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో అందుబాటులో ఉంటుంది. కాబట్టి, ఈ మోడల్ లో కస్టమర్లు ఎక్కువగా ఇంజన్ ఆప్షన్లు ఇంకా గేర్‌బాక్స్ ఆప్షన్లను ఎంచుకునే అవకాశాన్ని పొందడం జరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: