ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ అయిన టెస్లా (tesla)చాలా కాలంగా భారత మార్కెట్లోకి ఎంట్రీ చేసేందుకు ఎంతగానో ప్రయత్నిస్తోంది. అయితే సంస్థ ప్రయత్నాలలో పెద్దగా ముందుకు సాగినట్లు లేదు

తాజాగా టెస్లా సిఈఓ అయిన ఎలాన్ మస్క్ సంస్థ కార్లను ఇండియాలో లాంచ్ చేయలేకపోవడానికి గల కారణాన్ని తన ట్వీట్ ద్వారా తెలియజేశారు. ఎలోన్ మస్క్ 2019లో భారతదేశంలో టెస్లా ఇంక్. కార్లను విక్రయించాలని కోరుకున్నారట..

 
భారతదేశంలో టెస్లా కార్లను లాంచ్ చేయడానికి అవకాశం ఉన్న తేదీ గురించి ట్విట్టర్‌లో ఒక వినియోగదారు అడిగినప్పుడు, "సంస్థ ప్రస్తుతం భారత ప్రభుత్వంతో ఎన్నో సవాళ్లపై కృషి చేస్తోందని అని ఎలోన్ మస్క్ బదులిచ్చారు. అయితే, ఈ సవాళ్లు ఏమిటి, ప్రభుత్వంతో సమస్యలను ఎలా పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నారో ఎలోన్ మస్క్ పేర్కొనలేదని తెలుస్తుంది.

 

ఎలోన్ మస్క్ జూలై 2020లో ఒక ట్వీట్‌కు రిప్లయ్ ఇస్తూ భారతదేశంలో టెస్లా కార్లను ప్రారంభించాలనుకుంటున్నానని అయితే ప్రపంచంలోని అన్ని ప్రముఖ దేశాల కంపెనీలు భారతదేశంలోకి దిగుమతి అవుతున్నాయని చెప్పాడట.భారతదేశంలో అత్యధిక సుంకం కారణంగా టెస్లా తాత్కాలిక ఉపశమనం పొందుతుందని చెప్పాడట.
 
భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్లపై సుంకం ఎంత,
భారతదేశంలో 40 వేల డాలర్ల కంటే ఎక్కువ (సుమారు 28 లక్షల రూపాయల కంటే ఎక్కువ) ధర ఉన్న దిగుమతి చేసుకున్న ఎలక్ట్రిక్ వాహనాలపై 100 శాతం పన్ను విధించబడుతుందట అయితే దీని కంటే తక్కువ ధర ఉన్న వాహనాలపై 60 శాతం పన్ను విధించబడుతుందట. ఈ కోణంలో ఎలోన్ మస్క్ కంపెనీ భారతదేశంలో కార్లను విడుదల చేసినప్పటికీ వాటి ధరలు చాలా ఎక్కువగా ఉంటాయని అలాగే అమ్మకాలు కూడా చాలా తక్కువగా ఉండవచ్చని తెలుస్తుంది.
 
టెస్లా సీఈఓ ఎలోన్ మస్క్, ప్రధాన మంత్రి అయిన నరేంద్ర మోదీ అడ్మినిస్ట్రేషన్ మధ్య సంవత్సరాల తరబడి చర్చలు జరుగుతున్నాయి లోకల్ ప్లాంట్ పై భిన్నాభిప్రాయాలు దేశంలోని దిగుమతి సుంకాలు ప్రతిష్టంభనకు దారితీశాయిట 
 
అక్టోబరులో భారతీయ మంత్రి మాట్లాడుతూ దేశంలో చైనా తయారు చేసిన కార్లను విక్రయించకుండా ఉండాలని టెస్లాను కోరినట్లు చెప్పారట.అయితే స్థానిక కర్మాగారం నుండి వాహనాలను తయారు చేయడం, విక్రయించడం, ఎగుమతి చేయలని వాహన తయారీ సంస్థాని కోరారట.భారతదేశం, చైనా జనాభాతో పోల్చితే ఎలక్ట్రిక్ వాహనాలకు తయారీదారులకు అత్యంత ఆశాజనకమైన మార్కెట్ అని అయితే దేశంలోని రోడ్లు ఇప్పటికీ సుజుకి మోటార్ కార్పోరేషన్, హ్యుందాయ్ మోటార్ తయారు చేసిన కార్లచే ఆధిపత్యం చెలాయిస్తున్నాయని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: