Renault Kiger 2022 : అదిరిపోయే డిజైన్ కలిగి ఉండటం వల్ల ఇండియన్ మార్కెట్లో 'రెనాల్ట్' (Renault) కంపెనీ అమ్మకాల పరంగా చాలా ఫాస్ట్ గా దూసుకెళ్తోంది. ఇందులో భాగంగా కంపెనీ మరింత ప్రజాదరణ పొందటానికి ఎప్పటికప్పుడు తమ కార్లను అప్డేట్ చేస్తూనే ఉంది. ఇప్పుడు రెనాల్ట్ కంపెనీ ఇండియన్ మార్కెట్లో తన '2022 రెనాల్ట్ కిగర్' అప్డేటెడ్ మోడల్ విడుదల చేసింది. ఈ కొత్త కాంపాక్ట్ SUV కార్ ప్రారంభ ధర రూ. 5.84 లక్షల (ఎక్స్-షోరూమ్).ఇక ఇండియన్ మార్కెట్లో విడుదలైన కొత్త 2022 రెనాల్ట్ కిగర్ కొత్త స్టైలిష్ డిజైన్ పొందటమే కాకుండా అప్డేటెడ్ ఫీచర్స్ కూడా ఈ కార్ పొందుతుంది. కంపెనీ దీని బుకింగ్స్ 2022 మార్చ్ 31 వ తేదీ నుంచి స్టార్ట్ చేయనుంది. కాబట్టి దీని డెలివరీలు కూడా త్వరలో స్టార్ట్ అవుతాయి.2022 మోడల్ రెనాల్ట్ కిగర్ ఇప్పుడు లేటెస్ట్ ఎక్స్టీరియర్ డిజైన్ పొందింది. 



ఇందులో ఫ్రంట్ స్కిడ్ ప్లేట్, టెయిల్ గేట్‌పై క్రోమ్, టర్బో డోర్ డెకాల్ ఇంకా అలాగే రెడ్ కలర్ వీల్ క్యాప్స్ మీరు గమనించవచ్చు. ఇవన్నీ కూడా ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి. అంతే కాకూండా ఇవి కారుని చాలా స్పోర్టీగా స్టైలిష్ గా కనిపించేలా చేస్తాయి.ఇక ఈ స్టైలిష్ కార్ ఇంటీరియర్ విషయానికి వస్తే, ఇందులో క్రూయిజ్ కంట్రోల్ ఇంకా అలాగే వైర్‌లెస్ ఛార్జింగ్ వంటి లేటెస్ట్ ఫీచర్స్ ని కంపెనీ అందించింది. వీటితో పాటు అలాగే కంపెనీ ఇందులో ఆటోమేటిక్ ఏసీ, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 8-ఇంచెస్ టచ్‌స్క్రీన్, రియర్ ఏసీ వెంట్స్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, కీలెస్ ఎంట్రీ ఇంకా అలాగే పుష్-బటన్ స్టాప్/స్టార్ట్ వంటి ఫీచర్లని కూడా యాడ్ చేసింది కంపెనీ. ఇక ఇవన్నీ కూడా ఇప్పుడు అందుబాటులో ఉన్న టాప్ వేరియంట్స్ లో దొరుకుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: