ఫేమస్ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కంపెనీ అయిన ఒకాయా ఈవీ ఈ దీపావళి పండుగను పురస్కరించుకొని వినియోగదారులను ఆకర్షించేందుకు తమ ఎలక్ట్రిక్ స్కూటర్లపై వివిధ రకాల ఆఫర్లను ప్రకటించింది. ఇంకా తమ పాపులర్ ఫాస్ట్ సిరీస్ లో రెండు కొత్త వేరియంట్లను విడుదల చేసింది.ఒకాయా ఫాస్ట్ సిరీస్ లో F2B (ఫాస్ట్ 2బి) ఇంకా F2T (ఫాస్ట్ 2టి) వేరియంట్లను విడుదల చేసింది. ఈ రెండు కొత్త వేరియంట్‌లు ఇప్పుడు ఫాస్ట్ ఎఫ్4 వేరియంట్‌ సరసన చేర్చబడ్డాయి.భారత మార్కెట్లో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు మంచి స్పందన లభిస్తోంది. ఈ నేపథ్యంలో, పండుగ సీజన్ సెంటిమెంట్ ను క్యాష్ చేసుకునేందుకు ఈవీ తయారీదారులు కొత్త ఉత్పత్తులను విడుదల చేయడంతో పాటుగా వివిధ రకాల ఆఫర్లను అందిస్తున్నారు. ఒకాయా కూడా తమ ఇ-స్కూటర్ల కొనుగోలుపై లక్కీ డ్రా ఆఫర్లను ప్రకటించింది. ఇందులో పాల్గొనే కస్టమర్లు కార్లు, ల్యాప్‌టాప్‌లు, టీవీలు, సెల్‌ఫోన్లు, వెండి నాణేలు, ప్రైజ్‌మనీ మొదలైనవి గెలుచుకునే అవకాశం పొందవచ్చు.ఈ ప్రత్యేకమైన గిఫ్ట్ స్కీమ్ అక్టోబర్ 31, 2022 వరకు చెల్లుబాటులో ఉంటుంది.


ఒకాయా కొత్తగా విడుదల చేసిన ఫాస్ట్ ఎఫ్‌2బి వేరియంట్ ధర రూ. 89,999 (ఎక్స్-షోరూమ్) గా ఉంటే, ఫాస్ట్ ఎఫ్2టి వేరియంట్ ధర రూ. 84,999 (ఎక్స్-షోరూమ్) గా ఉంది. కాగా, కంపెనీ ఇటీవలే గతంలో రూ. 89,999 గా ఉన్న ఫాస్ట్ ఎఫ్4 వేరియంట్ ధరను రూ. 1.09 లక్షలకు పెంచింది. ప్రస్తుత ఎఫ్4 వేరియంట్ తో పోల్చుకుంటే ఎఫ్2బి ఇంకా ఎఫ్2డి వేరియంట్‌లలో కంపెనీ తక్కువ సామర్థ్యం కలిగిన బ్యాటరీ ప్యాక్‌ లను ఉపయోగించింది.ఒకాయా ఈ రెండు ఇ-స్కూటర్లలోనూ ఒకే రకమైన 2.2 kWh LFP బ్యాటరీ ప్యాక్‌ని ఉపయోగించింది. ఈ బ్యాటరీ ప్యాక్ ఫుల్ ఛార్జింగ్ పై 70 నుంచి 80 కిలోమీటర్ల రేంజ్ ను అందిస్తుంది. అదేవిధంగా, ఈ రెండింటిలో ఎలక్ట్రిక్ మోటార్ కూడా ఒకే రకంగా ఉంటుంది, వీటిలో 2000 వాట్ ఎలక్ట్రిక్ మోటారును ఉపయోగించారు. ఈ మోటార్  వేగం గంటకు 70 కిలోమీటర్లు. ఒకాయా ఫాస్ట్ ఎఫ్4 కూడా ఇదే రకమైన పనితీరును అందిస్తుంది. ఇది పెద్ద బ్యాటరీ ప్యాక్ ఇంకా మరిన్ని అదనపు ఫీచర్లను కలిగి ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: