జగన్ పుట్టినరోజు సందర్భంగా ఒక న్యూస్ అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదేమిటంటే 2019లో జగన్ అధికారం చేపట్టడానికి ముఖ్య కారణం ఆయన చేపట్టిన పాదయాత్ర ముఖ్య కారణమని చెప్పవచ్చు. ఇప్పుడు మళ్లీ 2029 ఎన్నికలలో ముఖ్యమంత్రి పదవి చేపట్టడానికి మరోసారి పాదయాత్ర చేయబోతున్నట్లు తెలుస్తోంది. పాదయాత్ర 2.o జగన్ దాదాపుగా 5000 కిలోమీటర్లు ప్రయాణించనున్నట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్ అంతట ఈ పాదయాత్ర చేయబోతున్నారు. 2019లో 3600 km దూరం ప్రయాణించిన జగన్ ఇప్పుడు 5000 km ప్రయాణించనున్నారు. అయితే ఈ పాదయాత్ర సుమారుగా 15 నెలల పాటు ఉంటుందట. జగన్మోహన్ రెడ్డి ఈ పాదయాత్ర ఇంటి నుంచి బయల్దేరి యాత్ర పూర్తి అయ్యేవరకు ఎన్నికల ప్రచారం ముగిసే వరకు తగ్గే అవకాశం లేదని వినిపిస్తోంది.
2028 నుంచి పాదయాత్ర 2.o మొదలు కాబోతున్నట్లు వినిపిస్తోంది. మరి ఈ పాదయాత్ర జగన్ కి కలిసొస్తుందా లేదా అనే విషయం చూడాలి మరి. ఇప్పటివరకు పాదయాత్ర చేపట్టిన ప్రతి ఒక్కరు కూడా అధికారాన్ని చేపట్టారు. అదే సెంటిమెంట్ వైసీపీ పార్టీకి కూడా మరింత బలాన్ని ఇస్తోంది. 2029 ఎన్నికల టార్గెట్ గా ఈసారి మేనిఫెస్టో మరింత బలంగా ఉండబోతున్నట్లు వైసిపి వర్గాల నుంచి వినిపిస్తోంది. అలాగే కార్యకర్తల కోసం ప్రత్యేకించి కొన్నిటిని అమలు చేసేలా చూడబోతున్నారట. ఇవే కాకుండా వైసిపి పార్టీ 2029లో అధికారంలోకి వస్తే ఎలాంటివి చేస్తారనే అంశాలను కూడా పాదయాత్రలో చెప్పబోతున్నట్లు వినిపిస్తోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి