ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండుగా విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొదటి సారి జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి భారీ ఎత్తున అసెంబ్లీ స్థానాలు వచ్చాయి. దానితో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధినేత అయినటువంటి చంద్రబాబు నాయుడు ముఖ్య మంత్రి అయ్యాడు. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని లేకపోవడంతో చంద్రబాబు నాయుడు అమరావతిని రాజధానిగా చేయాలి అని నిర్ణయించాడు. అందులో భాగంగా రాజధాని కోసం ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి ఎన్నో భవంతులను కట్టించాడు. ఇక పనులు వేగవంతంగా జరిగే మరి కొంత కాలం లోనే అమరావతి పూర్తిగా రాజధానిగా ఏర్పడుతుంది అనే సమయం లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికలలో వైసిపి పార్టీ భారీ స్థాయిలో అసెంబ్లీ స్థానాలను దక్కించుకుంది. దానితో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. ఇక జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే అమరావతిని కాకుండా మూడు రాజధానులు అనే ప్రతిపాదనను తెర పైకి తెచ్చాడు.

దానితో చాలా మంది చంద్రబాబు నాయుడు అప్పటికే అమరావతిని రాజధానిగా చేయడం కోసం చాలా పెద్ద ఎత్తున ఖర్చు పెట్టి ఎన్నో భవనాలను నిర్మించాడు అని మళ్లీ మూడు రాజధానులు అనే ప్రతిపాదనను తెర పైకి తెస్తే అమరావతి చుట్టు పక్కల ఉన్న ప్రాంతాల ప్రజల నుండి వైసీపీ పార్టీకి తీవ్ర వ్యతిరేకత వస్తుంది అని దాని ద్వారా వచ్చే ఎన్నికలలో వైసిపి పార్టీకి చాలా కష్టాలు ఎదురవుతాయి అని అనేక మంది పెద్ద ఎత్తున విశ్లేషణ చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం వాటిని పెద్దగా పట్టించుకోకుండా తన పనిని తాను నిర్వహిస్తూ వెళ్ళాడు. ఆ విషయంలో కొంత మంది జగన్ చాలా గ్రేట్. అమరావతి చుట్టు పక్కల ప్రాంతాల్లో ఆయనకు అసెంబ్లీ స్థానాలు రావు అని తెలిసినా కూడా ఆయన అనుకున్న పనిని చేయడానికి ముందుకు వెళుతున్నాడు. దాని వల్ల అతనికి మంచి జరుగుతుందో చెడు జరుగుతుందో కానీ ఆయన మాత్రం చాలా ధైర్యంగా ముందుకు వెళుతున్నాడు అని కొంత మంది అభిప్రాయ పడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి: