టికెటెడ్ ఈవెంట్ అయితే తప్పనిసరిగా పోలీసుల అనుమతి తీసుకోవాలని, ఈవెంట్‌కు ఎంతమంది వస్తున్నారు, ఎంతమంది టిక్కెట్లు అమ్ముతున్నారు అనే పూర్తి వివరాలు ముందే సమర్పించాలని స్పష్టం చేశారు. ఇక పార్కింగ్ వ్యవస్థపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పారు. “ఈవెంట్ జరుగుతోంది” అనే పేరుతో రోడ్లపై గందరగోళం సృష్టిస్తే మాత్రం ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఏవైనా ప్రమాదాలు జరిగితే… దానికి పూర్తి బాధ్యత ఈవెంట్ నిర్వాహకులదేనని తేల్చి చెప్పారు. ముఖ్యంగా మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. తాగి ఇంటికి వెళ్లేవాళ్లు డ్రైవర్లను ఏర్పాటు చేసుకోవాలన్న సూచన కూడా ఇచ్చారు.
ఈ హెచ్చరికలకు మరింత పదును పెట్టారు హైదరాబాద్ వెస్ట్ జోన్ డీసీపీ సీహెచ్ శ్రీనివాస్. న్యూ ఇయర్ వేడుకలు ఆనందం కోసం మాత్రమే ఉండాలన్నారు. హద్దులు దాటి డ్రగ్స్, అక్రమ కార్యకలాపాల వైపు వెళ్లితే మాత్రం చట్టం తన పని తాను చేస్తుందని హెచ్చరించారు. పార్టీలు, పబ్బుల్లో డ్రగ్స్ వినియోగం లేకుండా నిర్వాహకులు చూసుకోవాలని, ఈ విషయంలో లా అండ్ ఆర్డర్ పోలీసులు మాత్రమే కాదు… ఈగల్ టీమ్ కూడా నిఘా పెట్టనున్నట్లు తెలిపారు. సామర్థ్యానికి మించి టిక్కెట్లు అమ్మకూడదని, సెలబ్రెటీలు వస్తే ముందస్తు సమాచారం ఇవ్వాలని సూచించారు. మైనర్లకు పార్టీల్లో ఎంట్రీ ఉండదని, 31 అర్ధరాత్రి ఆకస్మిక తనిఖీలు ఉంటాయని స్పష్టం చేశారు. మొత్తానికి ఈసారి న్యూ ఇయర్… ఫుల్ ఎంజాయ్ మోడ్‌లో ఉండాలి గానీ… లా అండ్ ఆర్డర్‌ను ఛాలెంజ్ చేసేలా మాత్రం ఉండకూడదన్నదే హైదరాబాద్ పోలీసుల క్లియర్ మెసేజ్.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి