ఇక రోజు రోజుకి కూడా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం విపరీతంగా పెరిగిపోతుంది. ఈ నేపథ్యంలో ప్యూర్ EV కొత్త ఎలక్ట్రిక్ బైకుని ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. కంపెనీ రిలీజ్ చేసిన ఈ బైక్ పేరు 'ప్యూర్ ఈవి ఎకోడ్రైఫ్ట్' (PURE EV ecoDryft).ఈ ప్యూర్ ఈవి ఎకోడ్రైఫ్ట్ ధర ఇండియన్ మార్కెట్లో (ఢిల్లీలో) రూ. 99,999 (ఎక్స్-షోరూమ్)గా ఉంది. ఈ ఎలక్ట్రిక్ బైక్ కొనుగోలు మీద సబ్సిడీ కూడా మనకు అందుబాటులో ఉంటుంది. అందువల్ల ఈ సబ్సిడీ రాష్ట్రాన్ని బట్టి మారుతూ ఉంటాయి. అయితే పాన్ ఇండియా ఎక్స్-షోరూమ్ ధర రూ. 1.15 దాకా ఉంటుంది.అయితే సబ్సిడీ తరువాత ఈ బైక్ తక్కువ ధరకే లభిస్తుంది. అందువల్ల ఇండియన్ మార్కెట్లో అందుబాటులో ఉన్న సరసమైన ఎలక్ట్రిక్ బైకుల లిస్టులో ఈ బైక్ కూడా ఒకటిగా మారింది.ఎకోడ్రైఫ్ట్ ఎలక్ట్రిక్ బైక్ మొత్తం నాలుగు కలర్ ఆప్షన్లో లభిస్తుంది. అవి బ్లాక్, గ్రే, బ్లూ ఇంకా రెడ్ కలర్స్. ఇవన్నీ కూడా చూడటానికి చాలా అందంగా ఇంకా ఆకర్షణీయంగా ఉంటాయి. ఈ లేటెస్ట్ ఎలక్ట్రిక్ బైక్ హైదరాబాద్‌లోని PURE EV తయారీ కేంద్రంలో డిజైన్ చేయబడుతుంది.


కంపెనీ ఈ బైక్ కోసం బుకింగ్స్ తీసుకోవడం ఇప్పటికే ప్రారంభించింది. అందువల్ల దీని డెలివరీలు మార్చి నెల మొదటి వారంలో ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది.ఇక ecoDryft ఎలక్ట్రిక్ బైక్ మీకు AIS 156 సర్టిఫైడ్ 3.0 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. ఇది ఒక ఫుల్ ఛార్జ్ తో గంటకు 75 కిమీ వేగంతో ఏకంగా 130 కిమీ రేంజ్ అందిస్తుంది. అలాగే ఇందులోని బ్యాటరీ 3 కిలోవాట్ ఎలక్ట్రిక్ మోటరుకి సపోర్ట్ చేస్తుంది. అందువల్ల పనితీరు చాలా బాగా ఉంటుంది. అందువల్ల ఈ బైక్ రోజువారీ వినియోగానికి ఇంకా అలాగే నగర ప్రయాణాలకు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది.ఇక ఈ ఎలక్ట్రిక్ బైక్ ఒక సారి పుల్ ఛార్జ్ చేసుకోవడానికి మొత్తం 6 గంటల సమయం పడుతుంది. అయితే 3 గంటల సమయంలో ఇది 20 నుంచి 80 శాతం ఈజీగా ఛార్జ్ చేసుకోగలదు. అదే సమయంలో 'ఎకోడ్రైఫ్ట్' డ్రైవ్, క్రాస్ ఓవర్ ఇంకా అలాగే థ్రిల్ అనే మూడు రైడింగ్ మోడ్స్ పొందుతుంది. ఇందులోని డ్రైవ్ మోడ్ ద్వారా గంటకు 45 కిమీ వేగంతో ముందుకు వెళ్ళవచ్చు. క్రాస్ ఓవర్ మోడ్ గంటకు 60 కిమీ వేగంతో ఇంకా థ్రిల్ మోడ్ గంటకు 75 కిమీ వేగంతో ప్రయాణించవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: