వారంతపు శలవులను సరదా గడిపేందుకు నాలుగు బస్సుల్లో వెళ్లిన పర్యాటకులు కొద్ది సేపట్లో గమ్యస్థానం చేరుకోవాల్సి ఉంది. ఈ లోపలే  వారు ప్రయాణిస్తున్న బస్సుల్లో ఒకటి అగ్నికి ఆహుతైంది.   12 మంది పిల్లలతో సహహా 45 మందికి పైగా మృతి చెందారు. ప్రమాదానికి కారణం సాంకేతిక లోపమా, బస్సు నడుపుతున్నడ్రైవర్ లోపమా, మరే ఇతర కారణం ఉందా? తరితర వివరాలు  తెలియాల్సి ఉంది.  
పశ్చిమ బల్గేరియాలోని హైవేపై మంగళవారం తెల్లవారు ఝాముకు కొన్ని గంటల ముందు నార్త్ మెసిడోనియన్ పర్యాటకులతో కూడిన బస్సు మంటల్లో కూలిపోవడంతో 12 మంది పిల్లలతో సహా కనీసం 45 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు.
కాలిపోతున్న బస్సు నుండి దూకిన ఏడుగురిని సోఫియాలోని ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి ప్రస్తుతం  నిలకడగా ఉందని ఆసుపత్రి సిబ్బంది తెలిపారు.  బస్సు ప్రమాదంలో ఇప్పటి వరకూ 45 మంది మరణించారని, ఇది బాల్కన్ దేశ చరిత్రలో అత్యంత ఘోరమైన బస్సు ప్రమాదం అని బల్గేరియా అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది.
  మంత్రి బోయ్కో రాష్కోవ్ మాట్లాడుతూ, "మృతదేహాలు లోపల కుప్పలు కుప్పలుగా కాలి బూడిదగా మారి ఉన్నాయి.  ఇక్కడ సీన్ భయంకరంగా ఉంది . నేను ఇంతకు ముందెన్నడూ ఇలాంటి ఘటన చూడలేదు,"  ఆని ఆయన ఘటనా స్థలి వద్ద విలేకరులతో అన్నారు.
ప్రమాదానికి కారణం అస్పష్టంగా ఉంది, అయితే బస్సులో మంటలు చెలరేగడానికి ముందు కానీ, తరువాత కానీ  జాతీయ రహదారినీ ఢీకొన్నట్లు  తెలుస్తోందని బల్గేరియన్ అధికారులు తెలిపారు.
సోఫియాకు పశ్చిమాన 45 కిమీ (28 మైళ్ళు) దూరంలో ఉన్న స్ట్రుమా హైవేపై తెల్లవారుజామున అంటే జీఎం.టి ప్రకారం  2:00 గంటల ప్రాంతంలో ప్రమాదం జరిగిందని బల్గేరియన్ అధికారులు తెలిపారు.  బస్సు  పార్టీ వారాంతపు హాలిడే ట్రిప్ నుంచి ఇస్తాంబుల్ , అక్కడి నుండి స్కోప్జేకి తిరిగి వస్తోంది అని అధికారులు తెలిపారు.  సుమారు 800 కిమీ  దూరం బస్సు ప్రయాణం చేసినట్లు తెలుస్తోందన్నారు.
టెలివిజన్ ఫుటేజీలో పలు అంశాలు వెలుగు చూశాయి. వర్షం కారణంగా  జాతీయ రహదారి తడి తడిగా ఉంది. అంతేకాక  బస్సు మధ్యలో  లోనుంచి  మంటలు చెలరేగినట్లు కనిపిస్తోందని అధికారులు తెలిపారు.

బల్గేరియా తాత్కాలిక ప్రధాన మంత్రి స్టెఫాన్ యానెవ్ ఇది అత్యంత విషాదకరమైన సంఘటన గా ఆయన అభివర్ణించారు. ప్రాణాలతో బయటపడిన వారిలో ఒకరితో తాను మాట్లాడానని  నార్త్ మెసిడోనియన్ ప్రధాన మంత్రి జోరన్ జావ్   చెప్పారు. బస్సులో పెద్ద పేలుడు సంభవించిందని, ఆ సమయంలో అందరూ నిద్ర పోతున్నారని వారు తనకు చెప్పినట్లు  జోరన్ జాన్ తెలిపారు.

ఉత్తర మాసిడోనియన్ ట్రావెల్ ఏజెన్సీకి చెందిన నాలుగు బస్సులు టర్కీ నుంచి సోమవారం ఆలస్యంగా బల్గేరియాలోకి ప్రవేశించాయని బల్గేరియన్  పరిశోధక విభాగం అదిపతి బోరిస్లావ్ సరాఫోవ్ తెలిపారు. ప్రమాదానికి గల కారణాలను ఇప్పుడిప్పుడే చెప్పడం వీలు కాదని ఆయన స్పష్టంచేశారు. ఈ సంఘటన ప్రపంచ వ్యాప్తంగా పలువురిని దిగ్భ్రాంతికి గురి చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: