బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్   ఇండస్ట్రీలోనూ అత్యంత డిమాండ్  క‌లిగి ఉన్న న‌టుల‌లో మనోజ్ బాజ్‌పాయ్ ఒకరు. 1990వ దశకంలో వచ్చిన ‘బందిపోటు క్వీన్’, ‘సత్య’, ‘శూల్’ వంటి అద్భుత‌మైన‌ సినిమాలతో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు ఈ హీరో. తాజాగా అమెజాన్‌లో స్ట్రీమ్‌ అయిన రాజ్, డీకే దర్శకత్వంలో వచ్చిన ‘ది ఫ్యామీలీ మ్యాన్’ వెబ్ సిరీస్‌తో ఆ పాపులారిటీ  కాస్త ఎక్కువ‌గానే పెరిగింది. తాజాగా  టాలీవుడ్ హీరోయిన్ సమంత గురించి  ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

మనోజ్  ఓ ఇంటర్వ్యూలో  మాట్లాడారు. సమంత మంచి అమ్మాయితో పాటు అద్భుతమైన నటి కూడా. నేను రెండవ‌సారి ‘ది ఫ్యామిలీ మ్యాన్’ సెకండ్ పార్ట్ చూస్తున్నప్పుడు ఈ విషయం  నాకు అర్థం అయింది.  ఆమె ఫోకస్, ఇంటెన్సిటీ, మెయింటైన్ చేసిన గ్రాఫ్, ఆమె చేసిన రీసెర్చ్ అన్నింటినీ చూసి నేను ఆశ్యర్యపోయాను అని పేర్కొన్నాడు.  ఈ సిరీస్‌లో క్యారెక్టర్ గురించి తెలిపేందుకు రాజ్, డీకే పంపిన వీడియోలను చూసి బాగా వర్కౌట్ చేసిందని నాకు ముందే తెలుసు అని చెప్పారు.  ఆమె మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్‌కి వెళ్లిన వీడియోలను దర్శకులు ఇద్దరూ నాకు చూపించారని వివ‌రించారు. ఆమె పూర్తిగా ప్రిపేర్ అయిన తరువాత‌నే ఈ పాత్ర చేయడానికి సిద్ధం అయింద‌ని తెలుసు అని వెల్ల‌డించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: