ఏపీ సీఎం జగన్ పాలనా పరంగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రతి రోజూ మధ్యాహ్నం 3 గటలనుంచి సాయంత్రం 5 గంటలవరకూ స్పందన కార్యక్రమం నిర్వహించాలని ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ కార్యక్రమం కచ్చితంగా జరగాల‌ని ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్ ఆదేశించారు. అలాగే ప్రతి సోమవారం జిల్లా, డివిజన్, సబ్‌ డివిజన్, మండల స్థాయిల్లో  స్పందన కార్యక్రమం తప్పకుండా నిర్వహించాల‌ని అన్నారు.


అంతే కాదు.. సంబంధిత అధికారులు కచ్చితంగా స్పందనలో పాల్గొనాల‌ని జగన్ తెలిపారు. ఇక ప్రతి బుధవారం స్పందన వినతులపై కలెక్టర్లు రివ్యూ చేయాలన్నారు. ప్రతి గురువారం చీఫ్‌ సెక్రటరీ జిల్లా కలెక్టర్లతో స్పందన కార్యక్రమంపై రివ్యూ నిర్వహించాల్సి ఉంటుంది. ఎస్‌డీజీ లక్ష్యాలపైనా సమీక్ష నిర్వహించాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. మరి ఈ ఆదేశాలైతే బాగానే ఉన్నాయి. అమలులో ఏం జరుగుతుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: