వృద్ధి రేటులో ఆంధ్రప్రదేశ్‌ దూసుకుపోయింది. 2021–22లో ఏపీ స్థూల ఉత్పత్తి వృద్ధిరేటు ఏకంగా 11.43 శాతంగా నమోదైంది. ఇది దేశంలోనే అత్యధిక వృద్ధి రేటుగా చెబుతున్నారు. దీనిపై సీఎం జగన్ సంతోషం వ్యక్తం చేశారు. వృద్ధిరేటులో ఏపీ టాప్‌గా నిలవడం సంతోషకరమన్న సీఎం జగన్.. 2021–22లో ఏపీ స్థూల ఉత్పత్తి వృద్ధిరేటు 11.43 శాతంగా నిలిచిందన్నారు. ఇది దేశ వృద్ధిరేటు కంటే అధికంగా ఉందన్న సీఎం జగన్.. పారదర్శక విధానాలే ఈ వృద్ధికి మూలకారణమని భావిస్తున్నానన్నారు.


అలాగే ఆగస్టు 25న నేతన్న నేస్తం,  సెప్టెంబర్‌ 22న వైయ‌స్సార్‌ చేయూత కార్యక్రమం చేపట్టబోతున్నట్టు సీఎం జగన్‌ తెలిపారు. అలాగే గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రది రోజూ మధ్యాహ్నం 3 గటలనుంచి సాయంత్రం 5 గంటలవరకూ స్పందన కచ్చితంగా జరగాలన్నారు. ప్రతి సోమవారం జిల్లా, డివిజన్, సబ్‌ డివిజన్, మండల స్థాయిల్లో కచ్చితంగా స్పందన జరగాలని కూడా సీఎం జగన్ ఆదేశించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: