ఉద్యోగ సంఘాలు నిర్వహించదలచుకున్న చలో విజయవాడ కార్యక్రమం వాయిదా పడింది. దీంతో సీఎం జగన్‌కు కాస్త ఊరట లభించింది. ఈ కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్నట్టు సీపీఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రకటించింది. చలో విజయవాడ వాయిదా పడినా సరే..  ఎక్కడికక్కడ నిరనసలు , ఆందోళనలు కొనసాగుతాయని ఏపీసీపీఎస్ ఈఏ స్పష్టం చేసింది. పోలీసులు, ప్రభుత్వ ఆంక్షల నేపథ్యంలో చలో విజయవాడ కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్నట్టు ఉద్యోగ సంఘం నేతలు వెల్లడించారు.

చలో విజయవాడను అడ్డుకునేందుకు రాష్ట్రవ్యాప్తంగా సీపీఎస్ ఉద్యోగులను ఎక్కడికక్కడ బైండోవర్ చేస్తున్నారు. నోటీసులు కూడా జారీ చేస్తున్నారు. దీంతో సీపీఎస్ ఎంప్లాయిస్ అసోసియేషన్ చలో విజయవాడ కార్యక్రమంపై పునరాలోచనలో పడింది. ప్రస్తుతానికి వాయిదా వేసుకున్నట్టు నేతలు స్పష్టం చేశారు. అయితే ఈ కార్యక్రమాన్ని సెప్టెంబర్ 11న తప్పకుండా నిర్వహిస్తామని నేతలు చెబుతున్నారు. మరి అప్పటి వరకూ ఏదైనా చర్చలు జరిగితే.. మంచిదే..


మరింత సమాచారం తెలుసుకోండి: