నిజంగా చెప్పాలి అంటే.. చర్మానికి ఆర్టిఫీషియల్ గా చేసిన క్రిముల కంటే కూడా సహజంగా ఉండే కాయగూరలు.. పండ్లు ఎంతో మంచి చేస్తాయి. చర్మానికి పూసిన మంచిదే.. తిన్న మంచిదే.. చర్మానికి ఈ క్యారెట్ ఎన్నో లాభాలు ఇస్తుంది. శరీరాన్ని ఆరోగ్యంగా చేస్తుంది.. అందుకే చర్మానికి క్యారెట్ తో ఎన్నో ఉపయోగాలు ఉంటాయి.. అందుకే కొన్ని రోజులు ఈ చిట్కాలు వాడండి.. ఆరోగ్యంగా తయారవ్వండి. 

 

క్యారెట్ లో బీటా కెరొటిన్‌ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఇది చర్మానికి ఎంతో మంచి చేస్తుంది. 

 

ఈ బీటా కెరొటిన్‌ చర్మానికి హానిచేసే అతినీలలోహిత కిరణాల ప్రభావం నుండి కాపాడుతుంది. 

 

రోజుకో క్యారెట్‌ తినడం వల్ల చర్మం ఆరోగ్యంగా తయారయ్యి తాజాగా మెరిసిపోతుంది.

 

గుమ్మడి గింజలు చర్మాన్ని బిగుతుగా మారుస్తాయి. ఈ గుమ్మడి గింజల్లో ఉండే ఒమెగా త్రీ ఫ్యాటీ ఆమ్లాలు చర్మంలో కొలాజెన్‌ శాతాన్ని పెంచుతాయి.

 

కొబ్బరినీళ్లు తాగడం వల్ల శరీరంలోని డీహైడ్రేషన్‌ని తగ్గించడంతో పాటూ చర్మానికీ తేమ తగ్గుతుంది. ఇది చర్మం తాజాగా కనిపించేలా చేస్తుంది.

 

నిమ్మజాతి పండ్లు.. ఈ పండ్లలో విటమిన్‌ సి ఎక్కువగా ఉంటుంది. ఇది కొలాజెన్‌ శాతాన్ని పెంచడంతో పాటూ, ఎండ నుండి చర్మాన్ని కాపాడుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: