ఎండాకాలంలో మీరు ఎంత కంట్రోల్ చేసినా చెమట ఆగదు. దాన్ని మ్యానేజ్ చేయడం ఒక్కటే మనం చేయగలిగేది. చాలా మంది చేసే పొరపాటు ఏమిటంటే చెమట మీద మళ్ళీ కాంపాక్ట్ పౌడర్ అద్దడం, ఇందువల్ల స్కిన్ కేకీ గా అయిపోతుంది. ఇక్కడ మీరు ఆయిల్ ని అబ్జార్బ్ చేసుకునే బ్లాటింగ్ షీట్స్ వాడితే మీ సమస్య చిటికెలో పరిష్కారమయిపోతుంది.కాటుక, మస్కారా, కాంపాక్ట్ పౌడర్.. ఇవన్నీ వాటర్ ప్రూఫ్ వెరైటీలో తీసుకోండి. ఇందు వల్ల చెమటకి మీ మేకప్ కరిగిపోవడం అంటూ ఉండదు. కాటుక కరిగి కళ్ళ మీద నించి బుగ్గల మీదకి కారదు.బ్రాంజర్ ని బుగ్గలు, నుదురు, గడ్డం మీద మాత్రం అప్లై చేయండి. మీరు బ్రాంజర్ వాడకపోతే లూజ్ ఫేస్ పౌడర్ యూజ్ చేయండి.ఇక అలాగే చెమట వాసన రాకుండా యాంటీ పెర్స్పైరెంట్ యూజ్ చేయండి.


అప్పుడు మీ వద్ద నుండి చక్కని పరిమళం వస్తూ ఉంటుంది.ఇక పెదాలు బాగుండాలంటే ఒక లేయర్ లిప్‌స్టిక్ వేసిన తరువాత క్లీన్ టిష్యూ పేపర్ తో ఒక సారి బ్లాట్ చేసి అప్పుడు ఇంకొక లేయర్ అప్లై చేయండి.కాంపాక్ట్ పౌడర్, పల్చగా బ్లష్, ఒక కోట్ మస్కారా, టింటెడ్ లిప్ బామ్ లేదా హైడ్రేటింగ్ లిప్ గ్లాస్.. ఇలా చేస్తే మీ మేకప్ లైట్ గా ఉంటుంది, నాచురల్ గా కూడా ఉంటుంది.బయట ఎండ పేల్చేస్తూ ఉంటే స్కిన్ మీద లేయర్లు, లేయర్లుగా ప్రోడక్ట్స్ వాడడం వల్ల ఏమీ ఉపయోగం ఉండదు. స్టిక్ కన్సీలర్, జెల్ బేస్డ్ లైట్ వెయిట్ ఫౌండేషన్ యూజ్ చేయవచ్చు. అసలు ఫౌండేషన్ బదులు బీబీ క్రీమ్ లేదా సీసీ క్రీమ్ వాడితే ఇంకా మంచిది. టింటెడ్ మాయిశ్చరైజర్ కూడా బాగా హెల్ప్ చేస్తుంది.ఇక ఇలాంటి మరెన్నో బ్యూటీ టిప్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో బ్యూటీ టిప్స్ గురించి తెలుసుకోండి...

మరింత సమాచారం తెలుసుకోండి: