టీనేజ్ వయసు వచ్చిన తర్వాత యువతలో ఆడ, మగ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికీ చర్మ సమస్యలు తలెత్తుతాయి అన్న విషయం ప్రతి ఒక్కరికీ తెలిసిందే. ముఖ్యంగా యువత ఈ వయసులో అందంగా కనిపించడం కోసం చర్మానికి ఎన్నో రకాల రసాయన పదార్థాలు కలిసిన క్రీములను, లోషన్లను ముఖానికి పట్టించి.. లేనిపోని సమస్యలను కూడా తెచ్చుకుంటూ ఉంటారు. అయితే ఈ సమస్యల వల్ల ముఖం మరింత అధ్వానంగా మారే అవకాశం ఉంటుంది. మనం తీసుకునే ఆహారంలో పోషకాల స్థాయి తగ్గిపోవడం.. అనవసరంగా మరింత అందంగా ఉండటానికి రకరకాల క్రీములను ఉపయోగించడం.. ఎక్కువ నీటిని తాగకపోవడం.. పరిసరాల కాలుష్యం.. ఇలా అన్నింటి వల్ల కూడా చర్మం పాడైపోయే అవకాశాలు ఉన్నాయి.


ఇక ఇలాంటి సందర్భాలలో చాలామంది చర్మ సౌందర్య నిపుణులను సంప్రదించి ఏం చేయాలో కూడా అడిగి పాటిస్తూ ఉంటారు. ఇక పైగా వేలకు వేలు ఖర్చు చేసుకుంటూ ఇబ్బందులు పడుతున్న ఎంతో మంది యువతకు ఇప్పుడు చెప్పబోయే చిన్న చిట్కా వల్ల అతి త్వరలోనే మీరు అనుకున్న ముఖం అందం  మీ సొంతమవుతుంది. అయితే వంటింట్లో దొరికే ఈ చిన్న చిట్కా ఉపయోగించడం వల్ల చర్మ సమస్యలను దూరం చేసుకోవచ్చు. అయితే ఆ చిట్కా ఏంటి.. ఎలా ఉపయోగించాలి ..అనే విషయాలను ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం..


మనం వంటల్లో ఉపయోగించే టమోటా పండు.. ఈ టమోటా పండు ను మనం ఆహారంలో ఒక భాగంగా చేసుకోవడం వల్ల ప్రేగు కు సంబంధించిన వ్యాధులను దూరం చేసుకోవడమే కాకుండా చర్మ సౌందర్యానికి కూడా ఈ టమోటా చాలా చక్కగా పనిచేస్తుంది. టమోటా లో ఉండే విటమిన్ సి ,ఎ, కె చర్మానికి మంచి చేకూర్చడమే కాకుండా ఎన్నో సౌందర్య సాధనాలు కూడా ఈ టమోటాలను ఉపయోగిస్తున్నారు. ముక్కు మీద, గడ్డం మీద చాలా మందికి బ్లాక్ హెడ్స్ చాలా అసహ్యంగా కనిపిస్తూ ఉంటాయి. అలాంటప్పుడు ఒక టమోటా తీసుకొని దానిని సగానికి కట్ చేసి.. చక్కెరలో ముంచి పూర్తిగా బ్లాక్ హెడ్స్ పైన రుద్ది , శుభ్రం చేసుకోవడం వల్ల త్వరగా తొలగిపోతాయి. మొటిమలు, చర్మం పొడి బారిపోవడం ఇలాంటి సమస్యలను కూడా టమోటా దూరం చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: