అసలు ఈ కాలంలో చాలా మందిలో కూడా తెల్ల వెంట్రుకలు అనేవి ఎక్కువగా కనిపిస్తున్నాయి. చిన్న వారిలో కూడా ఈ సమస్య ఎక్కువగా తలెత్తుతోంది. వైట్ హెయిర్ వల్ల చాలా మంది అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు.ఇక కొద్దిగా తెల్లని వెంట్రుకలు వచ్చినా కానీ దానిని కవర్ చేసుకోవడానికి చాలా రకాల ఇబ్బందులు పడుతుంటారు. హెయిర్ కలర్స్, డై, హెన్నా ఇంకా గోరింటాకు ఇలా చాలా వాడుతుంటారు. సహజ సిద్ధమైన ఉత్పత్తులు కనుక వాడితే అసలు ఎలాంటి సమస్య అనేది ఉండదు. కానీ దాని వల్ల ప్రయోజనం కూడా నామమాత్రం. అందుకే చాలా మంది కూడా తమ జుట్టుకు కలర్స్ వేసుకుంటారు. దీని వల్ల జుట్టు ఆరోగ్యం బాగా దెబ్బతింటుంది. అయితే గ్రే హెయిర్ ను నల్లగా మార్చుకునేందుకు ఇలా చేస్తే మీ జుట్టు నల్లగా నిగ నిగ లాడిపోతుంది.ఇక తెల్లని అలాగే బూడిద రంగులో జుట్టు వల్ల అసలు ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావు. కానీ చూసేందుకు బాగుండదని చాలా మంది కూడా ఫీలైపోతూ ఉంటారు. సరైన జీవన విధానం ఇంకా హార్మోన్ అసమతుల్యత వల్ల కూడా జుట్టు తెల్లగా మారుతుంది.ఇక తెల్లని జుట్టు వస్తే ఇక అది ఎప్పటికీ కూడా ఉండిపోతుందని.. కలర్స్ వేసుకుని మేనేజ్ చేయాల్సిందేనని చాలా మంది కూడా అనుకుంటారు. కానీ కొన్ని జాగ్రత్తలు పాటించడంతో పాటు సరైన డైట్ పాటిస్తే వైట్ హెయిర్ అనేది వెంటనే ఆగిపోతుంది. కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ లేని చిట్కాలు పాటించడం వల్ల వైట్ హెయిర్ సమస్యకు చక్కని పరిష్కారం లభిస్తుంది.ఉసిరిని చాలా ఔషధాల తయారీలో కూడా వాడుతుంటారు.


దీనిలో ఉన్న పోషకాలు ఇంకా విటమిన్ల వల్లే దీనికి అంతటి ప్రాధాన్యత. ఉసిరి ఆరోగ్యానికి చేసే మేలు అసలు అంతా ఇంతా కాదు. ఉసిరి తీసుకోవడం వల్ల చర్మం సౌందర్యం కూడా బాగా పెరుగుతుంది. ఉసిరిలో వుండే పోషకాలు రోజూ తీసుకుంటే..మీ జుట్టు రంగు మారకుండా ఉంటుంది. ఇంకా మెటబాలిజంని సక్రమంగా ఉంచేందుకు ఆమ్లా చక్కగా పని చేస్తుంది. ఉసిరి తీసుకోవడం వల్ల శరీరంలో పేరుకుపోయిన చెడు పదార్థాలు కూడా తొలగిపోతాయి. ఇక ఉసిరి కాయల నుండి జ్యూస్ తయారు చేయాలి. అంతకుముందు తలకు కొబ్బరి నూనెతో బాగా మసాజ్ చేయాలి. ఆ తర్వాత ఉసిరి జ్యూస్ ను తలకు బాగా పట్టించాలి. ఇక ఇలా తరచూ చేస్తే ఖచ్చితంగా మంచి ప్రయోజనం ఉంటుంది. జ్యూస్ కాకుండే ఉసిరి పొడి కూడా మీ తలకు పట్టించవచ్చు. ఉసిరి జ్యూస్ ను తాగడం వల్ల కూడా చాలా లాభం ఉంటుందని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: