ఈ కాలంలో జుట్టు కుదుళ్లకు పోషకాలు సరిగ్గా అందక అవి బలహీనపడి జుట్టు ఎక్కువగా రాలిపోతూ ఉంటుంది. అయితే జుట్టు రాలడాన్ని తగ్గించుకోవడానికి మనలో చాలా మంది కూడా బయట మార్కెట్ లో లభించే నూనెలను, యాంటీ హెయిర్ ఫాల్ షాంపులను వాడుతూ ఉంటారు. అయితే వీటిని వాడడం వల్ల ఎలాంటి ఫలితం లేక తీవ్ర నిరాశకు గురి అవుతూ ఉంటారు. జుట్టు రాలే సమస్యతో బాధపడుతున్నారు వీటికి బదులుగా సహజంగా లభించే కలబందను వాడడం వల్ల ఖచ్చితంగా మంచి ఫలితం ఉంటుంది.ఎందుకంటే కలబందలో ఉండే పోషకాలు, ఔషధ గుణాలు జుట్టు కుదుళ్లకు కావల్సిన పోషణను అందించి కుదుళ్లు గట్టి పడేలా చేస్తాయి.పైగా మనం ఈ కలబందను వాడడం వల్ల ఎలాంటి చెడు ప్రభావం కూడా ఉండదు. జుట్టు రాలడంతో బాధపడే వారు సహజంగా లభించే ఈ కలబందతో కొన్ని టిప్స్ తయారు చేసుకుని వాడడం వల్ల ఖచ్చితంగా మంచి ఫలితాలను పొందవచ్చు. జుట్టు రాలే సమస్యతో బాధపడే వారు కలబందను ఎలా వాడాలో ఇప్పుడు తెలుసుకుందాం.అయితే దీనికోసం మనకు తలకురాసుకునే నూనెను ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా 5టేబుల్ స్పూన్ల నూనెను గిన్నెలోకి తీసుకుని గోరు వెచ్చగా అయ్యే దాకా వేడి చేయాలి. ఆ తరువాత స్టవ్ ఆఫ్ చేసి గిన్నెను పక్కకు తీసి అందులో 3 టేబుల్ స్పూన్ల కలబంద గుజ్జు వేసి కలపాలి.


తరువాత ఇలా తయారు చేసుకున్న నూనెన రాత్రి పడుకునే ముందు జుట్టుకు బాగా పట్టించాలి.ఆ నూనె కుదుళ్లల్లోకి ఇంకేలా మర్దనా చేయాలి. ఇక దీనిని రాత్రంతా అలాగే ఉంచి ఉదయాన్నే షాంపుతో తలస్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల జుట్టు రాలడం ఈజీగా తగ్గుతుంది.ఇంకా అలాగే ఒక గిన్నెలో రెండు టేబుల్ స్పూన్ల కలబంద గుజ్జును తీసుకోవాలి. ఆ తరువాత ఇందులో 2 టేబుల్ స్పూన్ల ఉల్లిపాయ రసాన్ని వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుండి చివర్ల దాకా బాగా పట్టించాలి. తరువాత ఒక గంట పాటు అలాగే ఉంచి ఆ తరువాత తలస్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల కూడా చాలా మంచి ఫలితం ఉంటుంది. ఇంకా అలాగే కలబంద గుజ్జును నేరుగా జుట్టు కుదుళ్లపై కూడా రాయవచ్చు. అయితే ముందుగా జుట్టును చిక్కులు లేకుండా బాగా దువ్వాలి. ఆ తరువాత కలబంద గుజ్జును నేరుగా జుట్టుకుదుళ్లపై రాసి మర్దనా చేయాలి. ఒక గంట తరువాత షాంపుతో జుట్టును బాగా శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల జుట్టు కుదుళ్లు బాగా బలపడి జుట్టు రాలడం తగ్గుతుంది.ఈ విధంగా కలబందను వాడడం వల్ల జుట్టు రాలడం తగ్గి జుట్టు ఒత్తుగా ఇంకా పొడవుగా పెరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: