చర్మ సమస్యలు రాకుండా ఈ టిప్స్ పాటించండి ?

చర్మ సమస్యలు రాకుండా ఈ టిప్స్ పాటించండి.ఈ రోజుల్లో చాలా మంది కూడా పాదాల పగుళ్ల సమస్యతో బాధపడుతున్నారు. ఈ సమస్యని అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. ఇక బయట నుంచి వచ్చిన తర్వాత పాదాలను బాగా శుభ్రం చేసి క్రీమ్ రాసుకోవాలి. పాదాల సమస్యను నివారించడానికి పెట్రోలియం జెల్లీని ఉపయోగించాలి. శరీరంలో విటమిన్ డి లేకపోవడం చర్మ సమస్యలకు దారితీస్తుంది. ఎండలో కూర్చోవడం వల్ల మాత్రమే తగినంత విటమిన్ డి పొందడం సాధ్యం కాదు. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి విటమిన్ డి సప్లిమెంట్లను తీసుకోవచ్చు. అలాగే నీళ్లు ఎక్కువగా తాగాలి. తాజా కూరగాయలు, పండ్లు ఎక్కువగా తినాలి.డే టైం లో బయటకు వెళితే సన్‌స్క్రీన్ రాసుకోవడం మర్చిపోకూడదు. శీతాకాలంలో సూర్యుడి వేడి హాయిగా అనిపించినా.. చర్మానికి తీవ్రమైన హానిని కలిగిస్తుంది. సన్‌టాన్ అవుతుంది. కాబట్టి చలికాలంలో బ్రాడ్ స్పెక్ట్రమ్ సన్‌స్క్రీన్ ఉపయోగించడం మంచిది. 


అలాగే చలికాలంలో పెదవులు పగిలిపోవడం సర్వసాధారణం. కానీ నిర్లక్ష్యం చేయకూడదు. పెదవులపై మాయిశ్చరైజర్ లేదా లిప్ బామ్‌ను క్రమం తప్పకుండా రాసుకుంటూ ఉండాలి.రెగ్యులర్ స్క్రబ్బింగ్ కూడా చేసుకుంటూ ఉండాలి. ఇది చర్మ రంధ్రాలలో పేరుకున్న మురికిని, ధూళిని తొలగిస్తుంది. హైడ్రేటింగ్ క్లెన్సర్‌తో స్క్రబ్బింగ్ చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. ఈ కాలంలో చాలా మంది సబ్బుతో ముఖాన్ని కడుక్కుంటుంటారు. బదులుగా శీతాకాలంలో మాయిశ్చరైజర్‌తో కూడిన సబ్బును ఉపయోగించాలి. అప్పుడు చర్మం కరుకుదనం సమస్య ఉండదు. ముఖం శుభ్రం చేసుకున్న తర్వాత, ఖచ్చితంగా క్రీమ్ రాసుకోవాలి.మీకు సున్నితమైన చర్మం ఉన్నట్లయితే, ఏదైనా మాయిశ్చరైజర్‌ని ఉపయోగించే ముందు నిపుణుడిని సంప్రదించడం మర్చిపోకూడదు.కాబట్టి చర్మ సంరక్షణకి ఖచ్చితంగా పైన తెలిపిన టిప్స్ పాటించండి.చర్మ సమస్యలు రాకుండా ఈ టిప్స్ పాటించండి. మీ చర్మాన్ని ఎల్లప్పుడూ కూడా సంపూర్ణ ఆరోగ్యంగా ఉంచుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి: