తెలంగాణ లో వరుస ఎన్నికలతో రాజకీయాలు ఎంతో ఆసక్తి కరంగా మారుతున్నాయి.. ఇటీవలే దుబ్బాక ఉప ఎన్నికతో పాటు, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు కూడా పూర్తి కావడంతో ఇప్పుడు మరో ఎన్నికల నిర్వహణకు సిద్ధమైంది ఎన్నికల కమిషన్.. నాగార్జున సాగర్ లో త్వరలో ఇక్కడ ఉప ఎన్నిక జరగనుంది.. అధికార పార్టీ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య అర్థాంతరంగా మరణించగా ఈ ఉప ఎన్నిక అనివార్యమైంది.. ఇక్కడ గెలుపుకోసం అన్ని పార్టీ లు కాచుకుని కూర్చున్నాయి.