టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఒకరు అయినటువంటి అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న మన శంకర వర ప్రసాద్ గారు అనే సినిమాలో హీరో గా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లో నయనతార హీరోయిన్గా నటిస్తూ ఉండగా ... బీమ్స్ సిసిరిలియో ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. విక్టరీ వెంకటేష్మూవీ లో ఓ కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడు. ఇప్పటికే ఈ విషయాన్ని ఈ మూవీ బృందం వారు అధికారికంగా చాలా రోజుల క్రితమే ప్రకటించారు. ఈ సినిమాను వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12 వ తేదీన విడుదల చేయనున్నారు.

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ ను ఈ మూవీ యూనిట్ విడుదల చేసింది. ఈ సినిమాకు సంబంధించిన యుఎస్ బుకింగ్స్ ను తాజాగా ఓపెన్ చేసినట్లు ఈ మూవీ బృందం వారు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ సినిమాను ఓవర్ సిస్ లో సరిగమ సినిమాస్ సంస్థ వారు విడుదల చేయనున్నారు. 

మూవీ కి సంబంధించిన ప్రీమియర్ షో లను ఓవర్ సిస్ లో జనవరి 11 వ తేదీ నుండే ప్రదర్శించనున్నట్లు ఈ మూవీ బృందం వారు ప్రకటించారు. మరి ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన యుఎస్ టికెట్ బుకింగ్ లు ఓపెన్ కావడంతో ఈ మూవీ టికెట్ బుకింగ్ లకి మంచి రెస్పాన్స్ ప్రేక్షకుల నుండి యుఎస్ లో  లభించినట్లయితే ఈ మూవీ కి యుఎస్ లో మంచి ఓపెనింగ్స్ లభించే అవకాశం ఉంటుంది అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు. ప్రస్తుతానికి మన శంకర వర ప్రసాద్ గారు మూవీ ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. మరి ఈ సినిమా ఎలాంటి టాక్ ను తెచ్చుకొని ఏ స్థాయి విజయాన్ని సొంతం చేసుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: