బాహుబలి సినిమా తో తన స్టామినా తెలియజేయడమే కాదు హీరో గా కూడా నిలదొక్కుకోవడానికి రానా కి ఈ సినిమా ఎంతగానో ఉపయోగపడింది..అంతకుముందు సాదాసీదా హీరో గా ఉన్న రానా కు ఈ సినిమా ఒక్కసారి గా మంచి పాపులారిటీ తెచ్చింది. బాహుబలి కంటే ముందే రానా కు పలుభాషల్లో మంచి పరిచయముంది.. అంతకుముందే రానా తమిళ, హిందీ సినిమాల్లో మెరిసి ప్రేక్షకులను మురిపించాడు.. అయితే అది అంతగా ఇంపాక్ట్ ఇవ్వలేదని చెప్పాలి.. ఓ సాదా సీదా నటుడిగా మాత్రమే పరిచయమైనా రానా బాహుబలి తో ఇతను మాములు నటుడు ఏం కాదని మాత్రం చెప్పేశాడు..