చాలా రోజుల త‌ర్వాత టాలీవుడ్ న‌టుడు, నిర్మాత‌ బండ్ల గ‌ణేశ్ నోటి నుంచి మ‌ళ్లీ రాజ‌కీయ ముచ్చ‌ట్లు వ‌చ్చాయి. క‌రోనా వైర‌స్ సృష్టించిన విప‌త్క‌ర ప‌రిస్థితుల నేప‌థ్యంలో ఆయ‌న ఏపీ రాజ‌కీయాల‌పై ఆస‌క్తిక‌ర‌మైన కామెంట్స్ చేశాడు. ముఖ్యంగా ఏపీ నేత‌ల‌కు చుర‌క‌లు అంటించాడు. కొద్దిరోజులుగా అధికార వైసీపీ, ప్ర‌తిప‌క్ష టీడీపీ, బీజేపీ నేత‌ల మ‌ధ్య జ‌రుగుతున్న మాట‌ల యుద్ధంపై బండ్ల గ‌ణేశ్ స్పందించారు. *ఎన్నిక‌లు ప్ర‌తీ ఐదేళ్ల‌కోసారి మాత్ర‌మే వ‌స్తాయ‌ని ప్ర‌జ‌లు అనుకుంటారు. కానీ టీవీల్లో ఆంధ్ర‌ప్ర‌దేశ్ నాయ‌కుల డిబేట్లు చూస్తుంటే.. ప్రతీ నెలా ఎన్నిక‌లు వ‌స్తాయేమోన‌న్న భ‌యంతో మాట్లాడుతున్న‌ట్లు అనిపిస్తుంది. ఇది జీవన్మరణ పోరాటం..  దయజేసి రాజకీయాలు పక్కనపెట్టి ప్రజలను కాపాడండి. తెలంగాణ రాజకీయ నాయకులను చూసి నేర్చుకోండి.. కష్టకాలంలో ఎలా ఉండాలో తెలంగాణ నేత‌ల‌ను చూసి నేర్చుకోండి. ఇది రాజకీయాలకు సమయం కాదు. ఇది బతుకు పోరాటం.. దయజేసి అర్థం చేసుకోండి* అంటూ ట్వీట్ చేశారు.

 

ఇదిలా ఉండ‌గా.. అంత‌కుముందు తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌పై బండ్ల గ‌ణేశ్ ప్ర‌శంస‌లు కురిపించారు. బండ్ల పొగ‌డ్త‌ల‌లో ఆంత‌ర్యం ఏమిటో మ‌రి. తెలంగాణలో జ‌గిరిన ముంద‌స్తు అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ముందు బండ్ల గ‌ణేశ్ కాంగ్రెస్ పార్టీలో చేరిన విష‌యం తెలిసిందే. ఎన్నిక‌లు ఫ‌లితాలు వ‌చ్చిత‌ర్వాత పార్టీకి గుడ్ బై చెప్పేసి.. ప్ర‌స్తుతం సినిమాల‌పై దృష్టిపెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: