తెలంగాణ రాష్ట్ర సమితి 20వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు, టీఆర్‌ఎస్‌ శ్రేణులకు పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ర్టాన్ని సాధించడంతోపాటు, సాధించుకున్న రాష్ట్రంలో అన్నిరంగాల్లో టీఆర్‌ఎస్‌పార్టీ గొప్ప విజయాలను సాధించిందని ఆయ‌న‌ సంతృప్తి వ్యక్తంచేశారు. *టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం గడిచిన ఆరేండ్లలో అనేక అద్భుతాలు సాధించింది. సంక్షేమం, విద్యుత్‌, తాగునీరు, సాగునీరు, వ్యవసాయం, పరిశ్రమలు తదితర రంగాల్లో గొప్ప విజయాలు నమోదుచేసింది. ప్రజలు దశాబ్దాలుగా ఎదుర్కొంటున్న అనేక సమస్యలను పరిష్కరించింది. దేశానికే ఆదర్శంగా నిలిచేలా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో పథకాలు, కార్యక్రమాలు అమలుచేస్తున్నది. ఇది పార్టీ శ్రేణులకు, రాష్ట్ర ప్రజలకు ఎంతో గర్వకారణం* అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

 

గొప్పగా నిర్వహించుకోవాల్సిన వేడుకలను కరోనా వైరస్‌ నేపథ్యంలో నిరాడంబరంగా జరుపుకోవాలని పార్టీ నాయకత్వం నిర్ణయించిందని ఆయ‌న తెలిపారు. మరో సందర్భంలో పార్టీ ద్విదశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకుందామ‌ని ఆయ‌న అన్నారు. ఈసారికి మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు ఎవరికివారు తమ ప్రాంతాల్లో అత్యంత నిరాడంబరంగా పతాకావిష్కరణ చేయాలని, తెలంగాణ అమరువీరులకు నివాళులర్పించాల‌ని ఆయ‌న పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు కచ్చితంగా ప్రభుత్వ మార్గదర్శకాలను పాటించాలని అని అన్నారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సోమవారం ఉద యం 9.30 గంటలకు తెలంగాణభవన్‌లో కేసీఆర్‌ గులాబీ జెండాను ఆవిష్కరించనున్నారు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: