ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు మీడియాతో మాట్లాడుతూ దేశంలో ఎక్కువ మంది కి పరీక్షలు నిర్వహిస్తున్న రాష్ట్రంగా ఏపీ నిలిచిందని అన్నారు. నెల రోజుల్లో రాష్ట్రంలో టెస్టింగ్ సామర్థ్యాన్ని పెంచామని చెప్పారు. గతంలో రాష్ట్రంలో ఒక్క ల్యాబ్ కూడా లేదని ల్యాబ్ ల సంఖ్య 9కు పెంచామని అన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 74,551 మందికి కరోనా పరీక్షలు జరిపామని చెప్పారు. 
 
రాష్ట్రంలో సగటున ప్రతి పది లక్షల మందిలో 1396 పరీక్షలు జరుపుతున్నామని చెప్పారు. రాష్ట్రంలోని 676 మండలల్లో 63 మండలాలు రెడ్ జోన్ లో, 53 మండలాలు ఆరెంజ్ జోన్ లో మిగిలిన మండలాలు గ్రీన్ జోన్ లో ఉన్నాయని అన్నారు. దేశ సగటు కంటే ఏపీలో ఎక్కువగా కరోనా పరీక్షలు జరుగుతున్నాయని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో మరికొన్ని రోజుల్లో కరోనా పూర్తి స్థాయిలో తగ్గుముఖం పడుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: