పశ్చిమ బెంగాల్ రాష్ట్రం లోని ఖరగ్ పూర్ ఐఐటి లో తెలుగు విద్యార్థి మరియు రీసెర్చ్ స్కాలర్ అయినటువంటి కొండలరావు ఆదివారం రాత్రి ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సోమవారం రోజు తోటి విద్యార్థులు అతని కోసం ఎదురుచూసి  రూమ్  నుంచి బయటకు రాకపోవడంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీస్ సిబ్బంది వచ్చి తలుపులు తెరిచి చూడగా కొండలరావు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకొని ఫ్యాన్ కి వేలాడుతూ కనిపించాడు. దీంతో పోలీస్ అధికారులు  బాడీ నీ పోస్టుమార్టం కొరకు ప్రధాన ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అయితే కొండల రావు స్వస్థలం విజయనగరం.

IHG

 

 

 

 విషయాన్ని తెలుసుకున్న  విజయనగరంలోని కొండలరావు తల్లిదండ్రులు స్థానిక పోలీసులు అనుమతితో ఖరగ్ పూర్ కు బయలుదేరి వెళ్లారు. అయితే  కొండలరావు ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. అయితే ఇష్టం లేని చదువు కారణంగానే అతడు ఆత్మహత్యకు పాల్పడినట్లు వార్తలు వస్తున్నాయి. కాగా  ఫిబ్రవరిలోనే వివాహం జరగడం గమనార్హం. ఆ తర్వాత లాక్ డౌన్ కు కొద్దిరోజుల ముందు కొండలరావు ఖరగ్ పూర్ క్యాంపస్ కు చేరుకున్నాడు. అతని భార్య ప్రస్తుతం చెన్నైలో ఉద్యోగం చేస్తోంది. మంచి భవిష్యత్ ఉన్న కొండలరావు ఇలా ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమని ఐఐటి ఖరగ్ పూర్ డైరెక్టర్ వి కే తివారీ అన్నారు. 2015 లోఖరగ్ పూర్ లోని ఇనిస్ట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లో  చేరిన కొండలరావు పరిశోధన పూర్తి చేసే పనిలో ఉన్నారని అతని స్నేహితులు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: