పెట్టుబడి కోసం రైతులు అప్పులు చేయకూడదు అని సిఎం వైఎస్ జగన్ అన్నారు. తమ ప్రభుత్వం రైతుల కోసమే ఏర్పడింది అని ఆయన అన్నారు. రైతు భరోసా కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా జగన్ కీలక వ్యాఖ్యలు చేసారు. రైతులకు అన్ని విధాలుగా తాము అండగా ఉంటామని ఆయన చెప్పారు. 

 

రైతుల కోసం జిల్లాకో జాయింట్ కలెక్టర్ ఉంటారని ఆయన వివరించారు. రైతులకు ఏ కష్టం వచ్చినా జేసీ ద్వారా తాము అందుబాటులో ఉంటామని చెప్పారు జగన్. గ్రామాల్లో అగ్రికల్చర్ అసిస్టెంట్ ఉంటారని, రైతులు ఏ పంటలు వేస్తే మంచిది అనేది ఆయన వివరిస్తారని జగన్ పేర్కొన్నారు. రైతు భరోసా కేంద్రాల్లో నాణ్యమైన విత్తనాలను అందిస్తామని రైతులకు పెట్టుబడి సాయం ఎన్ని కష్టాలు వచ్చినా ఆగదని ఈ సందర్భంగా స్పష్టం చేసారు జగన్.

మరింత సమాచారం తెలుసుకోండి: