తెలంగాణలో ఎంతో ప్రతిష్టాత్మకంగా  యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవాలయం పునర్నిర్మాణ పనులు కొనసాగిస్తున్నారు.  ఎప్పటికప్పుడు సీఎం కేసీఆర్ ఈ పనులను పర్యవేక్షిస్తున్నారు.  తెలంగాణ లో ఎప్పటికీ గుర్తుండిపోయే విధంగా ఈ ఆలయ పునఃనిర్మాణ పనులు జరుగుతున్నాయి. తాజాగా  యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవాలయం పునర్నిర్మాణ పనుల్లో అపశృతి చోటు చేసుకుంది.  YTDA అభివృద్ధి పనుల్లో భాగంగా ప్రెసిడెన్షియల్ సూట్ నిర్మాణం స్లాబు బుధవారం కుప్పకూలింది. అయితే ఇది కూలే సమయానికి అక్కడ ఎక్కువ మంది కార్మికులు లేరు. నలుగురు కార్మికులకు తీవ్ర గాయాలు కావడంతో వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు.  గాయపడిన వారు శ్రీకాకుళం, మహబూబ్‌నగర్ వాసులుగా గుర్తించారు. 

 

యాదాద్రిలో  వీవీఐపీ భక్తుల కోసం 20 వరకు ప్రెసిడెన్షియల్ సూట్ విల్లాల నిర్మాణం చేపట్టారు. అభివృద్ధి పనుల కోసం రూ.100 కోట్ల బడ్జెట్‌ను కూడా కేటాయించారు. ఈ పనుల్లో భాగంగా ని 6వ విల్లాలో పనులు జరుగుతున్న సమయంలో స్లాబ్ కూలింది. ఇదిలా ఉంటే ఇక్కడ నిర్మాణ పర్యవేక్షించే సమయంలో తగు జాగ్రత్త చర్యలు పాటించలేదని.. అందుకే ఇలాంటి ఘటన జరిగిందని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.   కాగా లాక్‌డౌన్ కావడంతో భక్తుల తాకిడి లేదు. ఈ నేపథ్యంలో అధికారులు పనుల వేగం పెంచారు. సీఎం కేసీఆర్ కూడా ప్రత్యేక దృష్టి పెట్టి ఈ పనులను నిత్యం పర్యవేక్షిస్తున్న సంగతి తెలిసిందే.

 

మరింత సమాచారం తెలుసుకోండి: