తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ రూరల్ జిల్లాలో విషాదం చోటు చేసుంది. జిల్లాలోని గీసుకొండ మండలం గొర్రెకుంటలో నలుగురు వలస కూలీలు ఆత్మహత్య చేసుకున్నారు. ఒక కోల్డ్ స్టోరేజ్ బావిలో దూకి వలస కూలీలు మృతి చెందారు. అధికారులు మృతులు బీహార్ కు చెందిన వారిగా గుర్తించారు. స్థానికంగా ఒక కంపెనీలో వీరు పని చేస్తున్నారని తెలుస్తోంది. లాక్ డౌన్ వల్ల సొంతూళ్లకు వెళ్లలేకపోవడంతో వీరు ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది. 
 
 
లాక్ డౌన్ వల్ల చాలా మంది వలస కార్మికులు ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్నారనే సంగతి మృతుల్లో ఒక చిన్నారి ఉన్నట్టు తెలుస్తోంది. 20 సంవత్సరాల క్రితం వీరు ఇక్కడికి వచ్చినట్టు తెలుస్తోంది. గత రెండు నెలలుగా చోటు చేసుకున్న పరిణామాల వల్ల వలస కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడంతో ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: