దేశంలో లాక్ డౌన్ సడలింపుల విషయంలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధి తీవ్ర వ్యాఖ్యలు చేసారు. అసలు ఒక ప్లానింగ్ లేకుండా ఏ విధంగా లాక్ డౌన్ ప్రకటించారో తెలియదు అని ఆయన విమర్శలు చేసారు. వలస కూలీలకు ఆసరా లేకుండా చేసారని ఆయన ఈ సందర్భంగా మండిపడ్డారు. 

 

పేదలకు కాంగ్రెస్ పార్టీ డబ్బులు ఇస్తుందని ఆయన పేర్కొన్నారు. వారికి కనీసం ఆహారం కూడా లేక రోడ్ల మీద నడిచి వస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసారు. కాసేపటి క్రితం లైవ్ లో మాట్లాడిన రాహుల్ ఈ వ్యాఖ్యలు చేసారు. వైరస్ తీవ్రత ఆ స్థాయిలో ఉన్నా ఎందుకు సడలింపు లు ఇచ్చారో చెప్పాలని రాహుల్ డిమాండ్ చేసారు. వలస కూలీల విషయంలో కేంద్రం ఏం చేసిందో చెప్పాలని ఆయన నిలదీశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: