దేశ వ్యాప్తంగా ఉపాధి హామీ పనులకు ఇప్పుడు మంచి డిమాండ్ వచ్చింది. ఉపాధి లేని వారు అందరూ కూడా పెద్ద ఎత్తున ఉపాధి హామీ పనులకు వెళ్తున్నారు. లాక్ డౌన్ లో వ్యాపారాలు లేని వాళ్ళు ఉద్యోగాలు కోల్పోయిన వాళ్ళు అందరూ కూడా ఇప్పుడు ఉపాధి హామీ పనులు చేసుకుని బతుకు నెట్టుకొస్తున్నారు. చివరికి ఐటి ఉద్యోగాలు చేసిన వాళ్ళు కూడా ఉపాధి హామీ పనులకు వెళ్ళే పరిస్థితి వచ్చింది. 

 

దేశ వ్యాప్తంగా దాదాపు అన్ని రాష్ట్రాల్లో కూడా ఇదే పరిస్థితి ఉంది. వ్యాపారాలు ఉద్యోగాలు కోల్పోయిన అందరూ కూడా ఇప్పుడు తమ కుటుంబాలను పోషించ కోవడానికి ఈ విధంగా ఉపాధి హామీ పనులకు వెళ్తున్నారు. తెలంగాణా ఆంధ్రప్రదేశ్ మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ లో ఈ పనులకు ఎక్కువగా వెళ్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: