దివంగ‌త మాజీ ముఖ్య‌మంత్రి, ఆంధ్రుల ఆరాధ్య దైవం ఎన్టీఆర్ కు తెలుగు ప్ర‌జ‌ల హృద‌యాల్లో ఎలాంటి స్థానం ఉందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. కృష్ణా జిల్లాలో పుట్టి గుంటూరు జిల్లాలో చ‌దువుకున్న ఎన్టీఆర్ ప్రారంభంలో కొద్ది రోజుల పాటు గుంటూరు జిల్లాలో ప్ర‌భుత్వ ఉద్యోగం చేసేవారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న గుంటూరు జిల్లాలోని ప్ర‌త్తిపాడు తో పాటు మంగ‌ళ‌గిరిలో ప్ర‌భుత్వ ఉద్యోగం చేశారు. ఆ త‌ర్వాత ఆయ‌న సినిమాల్లోకి వ‌చ్చి తిరుగులేని స్టార్ హీరో అయ్యారు. 

 

ఇక సినిమాల్లో ఎన్టీఆర్ రాముడిగా, కృష్ణుడిగా నటించి నిజ‌మైన దేవుడే ఎన్టీఆర్ అన్నంత పేరు తెచ్చుకున్నారు. ఆ త‌ర్వాత రాజ‌కీయాల్లో ఎన్టీఆర్ క్రియేట్ చేసిన సంచ‌ల‌నాలు అన్నీ ఇన్నీ కావు. 1982లో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్తాపించి పార్టీ పెట్టిన 9 నెల‌ల‌కే ముఖ్య‌మంత్రి అయ్యారు. ఆ త‌ర్వాత ఆయ‌న కెరీర్ మొత్తంలో మూడు సార్లు ముఖ్య‌మంత్రి అయ్యారు. 

 

ఇక ఎన్టీఆర్ అరుదైన ఫొటో ఒక‌టి ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. ఆయ‌న సినిమాల్లోకి రాక‌ముందు మంగ‌ళ‌గిరి లో స‌బ్ రిజిస్ట్రార్ ఆఫీస్‌లో ఉద్యోగం చేసిన‌ప్పుడు త‌న తోటి ఉద్యోగుల‌తో దిగిన ఈ అరుదైన ఫొటోను కొంద‌రు ట్విట్ట‌ర్ లో షేర్ చేయ‌డంతో బ‌య‌ట‌కు వ‌చ్చింది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: