దేశంలో సెప్టెంబర్ 15 తర్వాత ఇక కరోనా అనే పేరు వినపడే అవకాశం ఉండదా..? అంటే అవుననే సమాధానమే వినపడుతుంది. భారత్ లో సెప్టెంబర్ తర్వాత ఇక కరోనా అనే పేరు వినపడటం కష్టమే అని ఆరోగ్య శాఖకు చెందిన నిపుణులు చెప్తున్నారు. కేసులు పెరుగుతున్న తీరు ఆధారంగా ఈ లెక్కలు వేసారు.

 

కేసుల పెరుగుతున్న తీరు ఆధారంగా చేసుకుని ఓ మ్యాథమేటికల్ మోడల్ సాయంతో వారు ఈ అంచనా వేసారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఎపిడెమియోలాజీ ఇంటర్నేషనల్ అనే ఆన్‌లైన్ జర్నల్‌లో ప్రచురించారు కూడా. డీజీహెచ్ఎస్‌కు చెందిన అనిల్ కుమార్(డిప్యూటీ డైరెక్టర్ జనరల్), రూపాలీ రాయ్(డిప్యూటీ అసిస్టెంట్ డైరెక్టర్) దీని మీద అంచనాలు వేసి... వాతావరణం గనుక ఇలాగే ఉంటే మాత్రం అప్పటికి అసలు కోరనా ఉండదు అని చెప్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: