కర్ణాటకలో ఇప్పుడు రాజ్యసభ ఎన్నికల సందడి నెలకొంది. రాజ్యసభ ఎన్నికల్లో ఎలా అయినా సరే విజయం సాధించాలి అని కాంగ్రెస్ జేడియు పట్టుదలగా ఉన్నాయి. ఉమ్మడిగా తమ అభ్యర్ధులను ఈ రెండు పార్టీలు నిలబెడుతున్నాయి. బిజెపిని ఏ విధంగా అయినా సరే కట్టడి చెయ్యాలి అని భావిస్తున్నాయి. ఈ తరుణంలో ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. 

 

దీనిపై మాట్లాడిన మాజీ సిఎం కుమార స్వామి కీలక వ్యాఖ్యలు చేసారు. మా పార్టీ శాసనసభ్యులు, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఇంకా పలువురు నాయకుల విజ్ఞప్తి మేరకు రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేయాలని మాజీ ప్రధాని హెచ్‌డి దేవేగౌడ నిర్ణయించారని అని చెప్పారు. రేపు, ఆయన నామినేషన్ దాఖలు చేయనున్నారని కుమారస్వామి మీడియాకు వివరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: